డివిలియర్స్ విధ్వంసం.. కోల్‌కతా లక్ష్యం 195

డివిలియర్స్ (73*; 33 బంతుల్లో, 5×4, 6×6) విధ్వంసం సృష్టించడంతో కోల్‌కతాకు బెంగళూరు 195 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 194...

Updated : 12 Oct 2020 22:01 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డివిలియర్స్ (73*; 33 బంతుల్లో, 5×4, 6×6) విధ్వంసం సృష్టించడంతో కోల్‌కతాకు బెంగళూరు 195 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఆది నుంచి పడిక్కల్‌ (32; 23 బంతుల్లో, 4×4; 1×6), ఫించ్‌ (47; 37 బంతుల్లో, 4×4, 1×6) దూకుడుగా ఆడుతూ తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అయితే పడిక్కల్‌ పెవిలియన్‌కు చేరిన తర్వాత బెంగళూరు ఇన్నింగ్స్‌ నిదానంగా సాగింది. ఈ క్రమంలో దూకుడుగా ఆడటానికి యత్నించి ఫించ్‌.. ప్రసిధ్‌ కృష్ణ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 

అనంతరం డివిలియర్స్‌ వచ్చిన తర్వాత ఇన్నింగ్స్‌ స్వరూపం మారిపోయింది. వరుసగా సిక్సర్ల మోత మోగించాడు. నాగర్‌కోటి బౌలింగ్‌లో రెండు సిక్సర్లను స్టేడియం అవతలకి తరలించాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఆఖరి వరకు క్రీజులో ఉన్న కోహ్లీ (33*; 28 బంతుల్లో, 1×4) 19వ ఓవర్‌లో తన తొలి బౌండరీ బాదాడు. తొలి 15 ఓవర్లలో 111 పరుగులు చేసిన బెంగళూరు ఆఖరి అయిదు ఓవర్లలో విధ్వంసమే సృష్టించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని