Published : 01/10/2020 01:13 IST

కోల్‌‘ఖాతా’లో మరో విజయం

రాజస్థాన్‌కు తొలి ఓటమి

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో కోల్‌కతా అదరగొట్టింది. దుబాయ్‌ వేదికగా బుధవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో విధ్వంసకర బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌‌.. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్ల చేతిలో తడబడ్డారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (47, 34 బంతుల్లో; 5×4, 1×6), మోర్గాన్‌ (34*: 23 బంతుల్లో; 1×4, 2×6) మెరిశారు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ (4-0-18-2) రాణించాడు. అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ కోల్‌కతా బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది. టామ్‌ కరన్‌ (54, 36 బంతుల్లో; 2×4, 3×6) అర్ధశతకం సాధించాడు. బట్లర్‌, శాంసన్‌ వికెట్లు తీసిన శివమ్‌ మావి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకున్నాడు. 

ఆది నుంచి తడబాటే
ఛేదనకు దిగిన రాజస్థాన్‌ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రమం తప్పకుండా వికెట్లు తీసి కోల్‌కతా బౌలర్లు దెబ్బతీశారు. బట్లర్ (21, 16 బంతుల్లో; 1×4, 2×6) ఆదిలో మెరిసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇన్నింగ్స్‌ ఆరంభమైన రెండో ఓవర్‌లోనే సారథి స్మిత్ (3; 7 బంతుల్లో)ను కమిన్స్‌ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. సంజు శాంసన్‌ (8; 9 బంతుల్లో; 1×6),  రాబిన్ ఉతప్ప (2; 7 బంతుల్లో), రియాన్ పరాగ్‌ (1; 6 బంతుల్లో), రాహుల్ తెవాతియా (14; 10 బంతుల్లో; 1×6), శ్రేయస్ గోపాల్ (5; 7 బంతుల్లో), జోఫ్రా ఆర్చర్‌ (6; 4 బంతుల్లో; 1×6) పరుగులు చేశారు. అయితే టామ్‌ కరన్‌ ఆఖరి వరకు క్రీజులో నిలబడ్డాడు. చెత్త బంతుల్ని బౌండరీకి తరలిస్తూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. నరైన్‌ వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదాడు. కోల్‌కతా బౌలర్లలో శివమ్‌ మావి, నాగర్‌కోటి, చక్రవర్తి తలో రెండు వికెట్లు, కమిన్స్‌, కుల్‌దీప్‌, నరైన్‌ తలో ఒక్క వికెట్‌ పడగొట్టారు.

మెరిసిన గిల్, మోర్గాన్‌
అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ సునీల్ నరైన్‌ (15: 14 బంతుల్లో; 2×4, 1×6) మరోసారి నిరాశ పరిచాడు. ఉతప్ప ఇచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఉనద్కత్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మరోవైపు గిల్ మాత్రం మరోసారి చక్కని ప్రదర్శన కనబరిచాడు. నరైన్‌ ఔటైన తర్వాత నితీశ్‌ రాణా (22: 17 బంతుల్లో; 2×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అతడితో కలిసి రెండో వికెట్‌కు 46 పరుగులు చేశాడు. అయితే తెవాతియా వేసిన 10వ ఓవర్‌లో రాణా పెవిలియన్‌కు చేరాడు. కొద్దిసేపటికే గిల్‌ కూడా ఆర్చర్‌కు రిటర్న్‌క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్ కార్తీక్‌ (1), రసెల్ (24: 14 బంతుల్లో; 3×6), కమిన్స్‌ (12: 10 బంతుల్లో; 1×4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆఖర్లో మోర్గాన్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో కోల్‌కతా 174 పరుగులకు చేరింది. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ రెండు వికెట్లు తీయగా, అంకిత్ రాజ్‌పుత్, ఉనద్కత్, టామ్‌ కరన్‌, తెవాతియా తలో వికెట్ తీశారు. 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని