విమానాశ్రయంలో భారత క్రికెటర్‌ అడ్డగింత!

భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యకు ముంబయి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్‌ ముగించుకుని యూఏఈ నుంచి భారత్‌కు చేరుకున్న క్రమంలో డైరక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ

Published : 13 Nov 2020 01:01 IST

ముంబయి: భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యకు ముంబయి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్‌ ముగించుకుని యూఏఈ నుంచి భారత్‌కు చేరుకున్న క్రమంలో డైరక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు అతడిని అడ్డుకున్నారు. అతడి వద్ద ఉన్న బంగారం, ఇతర విలువైన వస్తువులకు అనుమతులు లేవనే ఆరోపణలతో విమానాశ్రయంలోనే నిలిపివేశారు. ఈ మేరకు డీఆర్‌ఐ వర్గాలు వెల్లడించారు. ఐపీఎల్‌ 2020లో భాగంగా కృనాల్‌పాండ్య ముంబయి ఇండియన్స్‌ జట్టు తరపున ఆడిన విషయం తెలిసిందే. కాగా ఈ టోర్నీ ఫైనల్‌లో ముంబయి జట్టు విజేతగా నిలిచి ఐదోసారి టైటిల్‌ను గెలుచుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని