లియోనెల్‌ మెస్సీ 643 సాధించాడు..

ప్రముఖ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌, అర్జెంటీనా ఆటగాడు లియోనెల్‌ మెస్సీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒకే క్లబ్‌ తరఫున 643 గోల్స్‌ సాధించి బ్రెజిలియన్‌ దిగ్గజ ఆటగాడు పీలే సరసన చేరాడు...

Published : 20 Dec 2020 14:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌, అర్జెంటీనా ఆటగాడు లియోనెల్‌ మెస్సీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒకే క్లబ్‌ తరఫున 643 గోల్స్‌ సాధించి బ్రెజిలియన్‌ దిగ్గజ ఆటగాడు పీలే సరసన చేరాడు. లా లీగా ఈవెంట్‌లో భాగంగా శనివారం వాలెన్షియా జట్టుతో తలపడిన సందర్భంగా మెస్సీ బార్సీలోనా తరఫున ఓ గోల్‌ చేశాడు. దీంతో ఈ క్లబ్‌ తరఫున అతడు 643 గోల్స్‌ సాధించాడు. మొత్తం 17 సీజన్లలో 748 గేమ్స్‌లో ఈ ఘనత నమోదు చేశాడు. అంతకుముందు పీలే సాంటోస్‌ జట్టు తరఫున 19 సీజన్ల పాటు ఆడి 643 గోల్స్‌ సాధించాడు. దీంతో అతడు ప్రపంచంలోనే అతిగొప్ప సాకర్‌ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు లియో అతడి రికార్డును సమం చేశాడు. తదుపరి మ్యాచ్‌లో మరొక్క గోల్‌ సాధిస్తే పీలేను అధిగమిస్తాడు. మరోవైపు బార్సిలోనా, వాలెన్షియా జట్లు తలపడిన మ్యాచ్‌ 2-2తో టైగా మారింది. ప్రస్తుతం ఈ లీగ్‌లో బార్సిలోనా 5వ ర్యాంక్‌లో కొనసాగుతోంది. 

ఇవీ చదవండి..
నిద్రమత్తులో టీమిండియా స్కోర్‌ 369 అనుకున్నా..!
36.. పరువు కంగారు పాలు
ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి ఇతరులను పట్టించుకోకండి..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని