ధోనీ.. ఓ సైనికుడిలా సేవచేశాడు: ఎమ్మెస్కే

టీమ్‌ ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ స్పందించారు. ధోనీ సుదీర్ఘకాలంగా క్రికెట్‌ రంగానికి ......

Updated : 16 Aug 2020 15:54 IST

హైదరాబాద్‌: టీమ్‌ ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ స్పందించారు. ధోనీ సుదీర్ఘ కాలంగా క్రికెట్‌ రంగానికి ఎంతో సేవలందించారని ప్రశంసించారు. భారత క్రికెట్‌ చరిత్రలో విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడని ‘ఈటీవీ’తో ఫోన్‌లో తెలిపారు.  మూడు ఐసీసీ ట్రోఫీలిచ్చాడనీ.. ఎన్నో ఐపీఎల్‌లు గెలిచాడని గుర్తు చేసుకున్నారు. ఒక గొప్ప ఆటగాడు ఈ రోజు రిటైర్మెంట్‌ ప్రకటించడం అందరికీ బాధాకరమైన విషయమేనని తెలిపారు.

భారత క్రికెట్‌ జట్టు గెలుపు కోసం ఒక నిజమైన సైనికుడిలా పనిచేశాడనీ.. తద్వారా క్రికెట్‌ ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడని కొనియాడారు. చరిత్రలో ఎప్పటికీ ధోనీ ఓ గొప్ప కెప్టెన్‌గా మిగిలిపోతాడన్నారు. అయితే, ఆయన రిటైర్మెంట్‌కు ప్రత్యేక కారణాలేమీ ఉండకపోవచ్చని, అది కేవలం ధోనీ వ్యక్తిగత నిర్ణయమేనని అభిప్రాయపడ్డారు. అతడికి రిటైర్మెంట్‌పై స్పష్టత ఉందని చెప్పారు. తనకు అనుబంధం ఉన్న ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకొని ఉండి ఉండొచ్చని తాను అభిప్రాయపడుతున్నట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని