Shooting: మనూకు స్వర్ణం.. రాహీకి రజతం

ప్రెసిడెంట్స్‌ కప్‌ షూటింగ్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ షూటర్లు మను బాకర్‌, రాహీ సర్నోబత్‌ సత్తా చాటారు. 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్లో మను పసిడి గెలవగా.. 25 మీటర్ల

Updated : 10 Nov 2021 12:30 IST

వ్రోక్లా (పొలెండ్‌): ప్రెసిడెంట్స్‌ కప్‌ షూటింగ్‌ టోర్నమెంట్లో భారత స్టార్‌ షూటర్లు మను బాకర్‌, రాహీ సర్నోబత్‌ సత్తా చాటారు. 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్లో మను పసిడి గెలవగా.. 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో రాహీ రజతం సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన మిక్స్‌డ్‌ ఫైనల్లో మను-వార్‌లిక్‌ (టర్కీ) జోడీ 9-7తో గ్జియా (చైనా)-పీటర్‌ ఒలెక్‌ (ఇస్తోనియా) జంటను ఓడించింది. ఆరంభంలోనే 6-2తో ఆధిక్యంలో నిలిచిన మను జంట.. ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి 6-6తో పోటీ ఎదుర్కొంది. కానీ ఒత్తిడిని అధిగమిస్తూ మను జోడీ విజేతగా నిలిచింది. అంతకుముందు 25 మీటర్ల పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో రాహీ సత్తా చాటింది. ఫైనల్లో చాలా వరకు రాహీదే అగ్రస్థానం. వరుసగా ఆమె మూడు సిరీస్‌లలో ముందంజలో నిలిచింది. కానీ చివరి రెండు సిరీస్‌లలో పిస్టల్‌ మొరాయించడంతో రాహీ (31 పాయింట్లు) రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెన్‌కాంప్‌ (జర్మనీ, 33 పాయింట్లు) స్వర్ణం గెలుచుకుంది. ఇదే ఈవెంట్లో మను బాకర్‌ ఆరో స్థానంలో నిలిచింది. ఇదే టోర్నమెంట్లో సౌరభ్‌ చౌదరి (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌) రజతం, అభిషేక్‌ వర్మ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు