వ్యాపారవేత్తతో షరపోవా ఎంగేజ్‌మెంట్

టెన్నిస్ స్టార్‌ మరియా షరపోవా తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. బ్రిటీష్‌ వ్యాపారవేత్త అలెగ్జాండర్‌ గిల్కెస్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేసి..

Published : 19 Dec 2020 01:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టెన్నిస్ స్టార్‌ మరియా షరపోవా తాను ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. బ్రిటీష్‌ వ్యాపారవేత్త అలెగ్జాండర్‌ గిల్కెస్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించింది. వారిద్దరు కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేసి.. ‘మేం తొలిసారిగా కలిసినప్పుడే ప్రేమను అంగీకరించాను. ఇది మా చిన్న రహస్యం. కాదంటారా?’ అని దానికి వ్యాఖ్య జత చేసింది. ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే అలెగ్జాండర్‌తో షరపోవా ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ, గతంలో షరపోవా దీన్ని అంగీకరించలేదు.

రష్యాకు చెందిన షరపోవా టెన్నిస్ అభిమానులకు సుపరిచితమే. ఆటకు ఆట, అందానికి అందం ఆమె ప్రత్యేకత. అయిదు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో పాటు ఎన్నో ఘనతలు సాధించింది. టీనేజ్‌లోనే అద్భుత ప్రదర్శనతో సంచలనాలు సృష్టించింది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించింది. కాగా, అలెగ్జాండర్‌ స్క్వేర్డ్‌ సర్కిల్స్‌‌ కంపెనీకి సహ యజమాని. అతడికి గతంలోనే ఫ్యాషన్‌ డిజైనర్‌ మిషాతో వివాహమైంది. అనంతరం వారిద్దరు వ్యక్తిగత కారణాలతో విడిపోయారు.

ఇదీ చదవండి

244 పరుగులకు భారత్‌ ఆలౌట్‌


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts