నా రిటైర్మెంట్‌కు పీసీబీనే కారణం

28 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించే విషయంలో పాకిస్థాన్‌ జట్టు యాజమాన్యమే కారణమని ఆ జట్టు పేసర్‌ మహ్మద్‌ అమిర్‌ విమర్శలు గుప్పించాడు. మూడు రోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు...

Published : 21 Dec 2020 01:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాను 28 ఏళ్లకే రిటైర్మెంట్‌ ప్రకటించడానికి పాకిస్థాన్‌ జట్టు యాజమాన్యమే కారణమని ఆ జట్టు పేసర్‌ మహ్మద్‌ అమిర్‌ ఆరోపించాడు. మూడు రోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రధాన కోచ్‌ మిస్బాఉల్‌ హక్‌, బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌.. జట్టులో తనపై తప్పుడు ప్రచారం చేశారన్నాడు. తనకు టెస్టు క్రికెట్ ఆడటంలో ఆసక్తి లేదని, డబ్బు కోసమే టీ20 లీగులు ఆడతున్నాననే విష ప్రచారం చేశారంటూ వాపోయాడు. ఏ ఆటగాడైనా పేరు సంపాదించడం చాలా కష్టమని తెలిపాడు.

ఇలా బయటకు రావడం మంచిది కాదని, కానీ, తాను భరించలేకే ప్రజలముందుకు వచ్చానని చెప్పాడు. తనకు మిస్బా, యూనిస్‌తోనే వివాదం నెలకొందని, ఈ క్రమంలోనే అసలేం జరుగుతుందనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనుకున్నట్లు వివరించాడు. అలాగే న్యూజిలాండ్‌ పర్యటనకు 35 మందిలో తనని ఎంపిక చేయలేదని, ఒకవేళ నిజంగా తాను టీ20 లీగ్‌ల మీదే ఆసక్తి చూపిస్తే ఈ విషయంపై బాధపడాల్సిన అవసరం తనకు లేదన్నాడు. ఒక సీనియర్‌ ఆటగాడిగా తనను జట్టులో కొనసాగించాలా వద్దా అనే విషయంపై ఒక స్పష్టమైన సమాచారం ఇవ్వలేకపోయారని చెప్పాడు. తాను ఆసియా కప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ, గతేడాది వన్డే ప్రపంచకప్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేశానని, ఇప్పటికీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కొనసాగుతున్నానని అమిర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకుమించి ఏం చేయాలని ప్రశ్నించాడు. తనని జాతీయ జట్టుకు ఎంపిక చేయనప్పుడు లీగ్‌ మ్యాచ్‌లు ఆడకుండా ఏం చేయాలని ప్రశ్నించాడు. ఆ రకంగా అయినా తన ప్రతిభను చాటాలనుకున్నట్లు స్పష్టం చేశాడు. 

ఇవీ చదవండి..

ధోనీ లాగే సాహా చేశాడు..

టీమ్‌ఇండియా @ 2020 అంతంతే..! 

దాదా రక్షించు.. శాస్త్రీ దిగిపో!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని