tokyo olympics 2021: చెవి కొరికేశాడు.. టీవీకి దొరికిపోయాడు

బాక్సింగ్‌లో చెవి కొరకడం అనగానే మైక్‌ టైసన్‌ గుర్తొస్తాడు. 1997లో ఇవాండర్‌ హోలీఫీల్డ్‌తో పోరులో ఈ యోధుడు చెవి కొరకడం అప్పట్లో పెద్ద సంచలనం. ..

Updated : 28 Jul 2021 09:22 IST

టోక్యో: బాక్సింగ్‌లో చెవి కొరకడం అనగానే మైక్‌ టైసన్‌ గుర్తొస్తాడు. 1997లో ఇవాండర్‌ హోలీఫీల్డ్‌తో పోరులో ఈ యోధుడు చెవి కొరకడం అప్పట్లో పెద్ద సంచలనం. అయితే ఒలింపిక్స్‌లోనూ దాదాపు అలాంటి ఘటనే చోటు చేసుకుంది. హెవీ వెయిట్‌ విభాగంలో డేవిడ్‌ నికా (న్యూజిలాండ్‌)తో పోరులో మొరాకో బాక్సర్‌ యూనెస్‌ బల్లా ప్రత్యర్థి చెవిని కొరికాడు. మరీ గట్టిగా కొరకకపోవడంతో నికాకు గాయం కాలేదు. బల్లా చేసిన పనిని రిఫరీ గుర్తించలేదు. టీవీలో మాత్రం కనబడింది. ఈ పోరులో నికా చేతిలో బల్లా ఓడిపోయాడు. బల్లా చేసిన పనిని సామాజిక మాధ్యమాల్లో అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ నికా మాత్రం ప్రత్యర్థిని వెనకేసుకొచ్చాడు. ‘‘క్రీడల్లో ఇలాంటి మామూలే. అతడి అసహనాన్ని అర్ధం చేసుకోగలను. ఆటగాడిగా బల్లాను గౌరవిస్తున్నా’’ అని నికా చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని