‘ఏబీ.. కోహ్లీ ఏం చేశాడో నువ్వు చూశావ్‌!’ 

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టులో తనదైన కామెడీతో మంచి గుర్తింపు పొందిన మిస్టర్‌ నాగ్స్‌ ఇప్పుడు భారత ఆటగాళ్లపై అసంతృప్తితో ఉన్నాడు. గతవారం జట్టు సభ్యులతో కలిసి...

Published : 05 Sep 2020 14:33 IST

మిస్టర్‌ నాగ్స్‌ వీడియోని షేర్‌ చేసిన ఆర్సీబీ

(ఫోటోలు: ఆర్సీబీ ట్విటర్‌)

ఇంటర్నెట్‌డెస్క్‌: తన హాస్యంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు సభ్యులను, అభిమానులను ఉత్సాహపరిచే మిస్టర్‌ నాగ్స్‌ ఇప్పుడు ఆ జట్టులోని భారత ఆటగాళ్లపై అసంతృప్తితో ఉన్నాడు. గతవారం జట్టు సభ్యులతో కలిసి వాలీబాల్‌ ఆడగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బంతిని తనపైకి తన్నాడని చెప్పాడు. దాంతో గాయాలయ్యాయని.. మళ్లీ వాళ్లతో కలిసి ఏ ఆటలు ఆడబోడనని తెలిపాడు. ఇకపై విదేశీ ఆటగాళ్లతోనే ఉంటానని, వాళ్లతోనే మాట్లాడతానని పేర్కొన్నాడు. ఇదాంతా మిస్టర్‌ నాగ్స్‌ ఒక వీడియోలో చెప్పగా ఆర్సీబీ దాన్ని ట్వీట్‌ చేసింది.

ఆ వీడయోలో నాగ్స్‌ చెప్పినట్టే భారత ఆటగాళ్లు పలకరించినా మాట్లాడలేదు. అలాగే విదేశీయుడిలా వేశధారణ మార్చుకొని కోచ్‌ సైమన్‌ కటిచ్‌, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డేల్‌ స్టెయిన్‌, ఏబీ డివిలియర్స్‌తోనే మాట్లాడాడు. ఈ సందర్భంగా ‘విరాట్‌ నా పట్ల ఏం చేశాడో నువ్వు చూశావు’ అని ఏబీతో అనగా.. ‘అవును నిజమే, చాలా దారుణంగా ప్రవర్తించాడు’ అని మిస్టర్‌ 360 జవాబిచ్చాడు. అనంతరం నాగ్స్‌.. కోహ్లీ పక్కన నిలబడినా ‌ పట్టించుకోలేదు. చివరికి అతడి వేషధారణ, జుత్తు రంగు బాగోలేదని కోహ్లీ జోక్‌ చేశాడు. కాగా, ఇదంతా ఆ జట్టులో నాగ్స్‌ చేసే సందడి. తన హాస్యంతో, వచ్చీరానీ ఇంగ్లిష్‌తో అతడు ఆర్సీబీ అభిమానులకు ఎంతో చేరువయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనను సరదాగా మలచుకుని ఇలా అలరించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని