టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రోహిత్‌

ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులకు మజానిస్తున్న టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో రోహిత్‌సేన

Updated : 06 Oct 2020 19:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్కంఠభరిత మ్యాచ్‌లతో అభిమానులకు మజానిస్తున్న టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ముంబయి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో రోహిత్‌సేన అయిదు మ్యాచ్‌లు ఆడగా మూడింట్లో విజయం సాధించింది. మరోవైపు రాజస్థాన్ నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట్లో గెలిచింది. అయితే ఇప్పటివరకు ముంబయి, రాజస్థాన్‌ 21 సార్లు తలపడగా ఇరు జట్లు 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒక్క మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 

జట్ల వివరాలు

ముంబయి: రోహిత్‌శర్మ(కెప్టెన్‌), డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, ప్యాటిన్సన్‌, రాహుల్‌ చాహర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా

రాజస్థాన్‌: బట్లర్‌, యశస్వీ జైశ్వాల్‌, సంజు శాంసన్‌, స్టీవ్‌ స్మిత్ ‌(కెప్టెన్‌), మహిపాల్‌ లొమ్రార్‌, రాహుల్ తెవాతియా, టామ్‌ కరన్‌, అంకిత్ రాజ్‌పుత్‌, జొఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, కార్తిక్‌ త్యాగి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని