
కపిల్‌దేవ్ వల్లే అలా మారాను: ద్రవిడ్
డబ్ల్యూవీ రామన్‌తో ఆసక్తికర విషయాలు వెల్లడించిన ది వాల్
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్‌ఇండియా ఆటగాడిగా కెరీర్ ముగిసిన అనంతరం ఏం చేయాలనే విషయంపై మాజీ సారథి కపిల్ దేవ్ సూచనలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. భారత మహిళా జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో ఆన్‌లైన్‌లో ముచ్చటించిన ద్రవిడ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘క్రికెటర్‌గా నా కెరీర్ ముగిసిన అనంతరం ఏం చేయాలో తొలుత పాలుపోలేదు. అప్పుడే కపిల్ దేవ్ ఒక మంచి విషయం చెప్పాడు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని.. కొన్నేళ్లు ఏదో ఒక పనిచేస్తూ నీకు ఏం నచ్చుతుందో దాని మీద ధ్యాసపెట్టమన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
ఇక తన కెరీర్ ముగింపు దశకు వచ్చేసరికే తాను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్, కోచ్ బాధ్యతల్లో కొనసాగుతున్నానని, అదృష్టవశాత్తూ అలా కోచింగ్ కెరీర్ కొనసాగిందని స్పష్టంచేశాడు. అలాగే 1998లో తనను వన్డే జట్టు నుంచి తప్పించారని, స్ట్రైక్‌రేట్ కారణంగా అలా చేయడంతో ఇక తాను ఈ ఫార్మాట్‌లో ఆడలేమోననే అభద్రతా భావం ఏర్పడిందన్నాడు. ఏడాది పాటు వన్డేల్లో ఆడలేదని ద్రవిడ్ చెప్పాడు. సహజంగా తాను టెస్టు క్రికెటర్ అని, తనకు కోచింగ్ కూడా టెస్టు క్రికెటర్‌లాగే సాగిందన్నాడు. ఒకవేళ తన కెరీర్ సాఫీగా సాగకపోయుంటే ఎంబీఏ చేసేవాడినని చెప్పాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: బెయిర్‌స్టో క్యాచ్ పట్టాక.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వీడియో..!
-
Business News
Maruti Alto K10: మళ్లీ రానున్న మారుతీ ఆల్టో కే10?
-
General News
Viral tweet: ‘క్యాబ్‌లో నేను ఇంటికి వెళ్లే ఖర్చుతో విమానంలో గోవా వెళ్లొచ్చు!’
-
Politics News
Revanth reddy: మోదీ ఉపన్యాసంతో శబ్ద కాలుష్యం తప్ప ఒరిగిందేమీ లేదు: రేవంత్‌రెడ్డి
-
Sports News
IND vs ENG: మరోసారి నిరాశపర్చిన కోహ్లీ.. టీమ్‌ఇండియా మూడో వికెట్ డౌన్
-
India News
Mamata Banerjee: సీఎం నివాసంలోకి ఆగంతకుడు.. రాత్రంతా అక్కడే..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి