నం.1గా 300 వారాలు

సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ డిసెంబరు 20తో ప్రపంచ నంబర్‌వన్‌గా 300 వారాలు పూర్తి చేసుకున్నాడు. ఫెదరర్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు...

Updated : 22 Dec 2020 07:30 IST

లండన్‌: సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ డిసెంబరు 20తో ప్రపంచ నంబర్‌వన్‌గా 300 వారాలు పూర్తి చేసుకున్నాడు. ఫెదరర్‌ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా ఉన్న ఫెదరర్‌ను అందుకునేందుకు జకోవిచ్‌కు కావాల్సింది మరో పది వారాలే. ఫెదరర్‌ 310 వారాల పాటు అగ్రస్థానంలో ఉన్నాడు. 33 ఏళ్ల జకోవిచ్‌ తొలిసారి 2011 జులైలో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజయంతో అతడు అయిదోసారి మొదటి స్థానానికి చేరుకున్నాడు. 

ఇవీ చదవండి..
36/9 ఊహించలేదు: బుద్ధిని వాడాలి!
8 జట్లతోనే వచ్చే ఐపీఎల్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని