ఈమెలా ఈతకొట్టడం.. ఎవరికైనా సాధ్యమా?

అమెరికాకు చెందిన 23 సంవత్సరాల కేటీ లెడెక్కీ ఐదు ఒలంపిక్‌ స్వర్ణపతకాల విజేత.

Published : 04 Aug 2020 19:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అమెరికాకు చెందిన 23 సంవత్సరాల కేటీ లెడెక్కీ ఐదు ఒలింపిక్స్‌ స్వర్ణపతకాల విజేత. అంతేకాకుండా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఈత పోటీల్లో 15 సార్లు ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. ఈతలో కేటీ నైపుణ్యం అనితర సాధ్యం అనేది నిర్వివాదాంశం అయినా.. ఈమె ఇటీవలి వీడియోను చూసిన వారు ఇదెలా సాధ్యమంటూ ఆశ్చర్యపోతున్నారు. కాగా, ఆ వీడియోను కేటీ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
ఇంతకీ ఆమె అంత గొప్పగా ఏం చేశారంటే... కేటీ తన తలపై చాక్లెట్‌ మిల్క్‌ ఉన్న ఒ గ్లాసును ఉంచుకుని ఓ స్విమ్మింగ్‌పూల్‌లో ఒక చివరి నుంచి రెండో చివరి వరకు ఈత కొట్టారు. ఈ పనిని ఆమె గ్లాసులో పాలు ఒక్క బొట్టు కూడా వొలకకుండా పూర్తిచేశారు. అనంతరం ఆమె తలపై నుంచి గ్లాసు తీసి చక్కగా తాగేయటాన్ని కూడా ఈ వీడియోలో మనం చూడచ్చు. దీనితో ఈమె పేరు మరోసారి నెట్టింట్లో మారుమోగుతోంది. ఇక ఈ అద్భుతమైన వీడియోను ఇప్పటికే సుమారు మూడుకోట్ల మంది చూడటంలో ఆశ్చర్యమేముంది!

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని