పీఎస్‌ఎల్‌ కన్నా ఐపీఎల్‌ ఉత్తమం

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నిర్వహించే పీఎస్‌ఎల్‌ కన్నా బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్‌ టోర్నీయే అతిపెద్దదని ఆ జట్టు దిగ్గజ బౌలర్‌ వసీం అక్రమ్‌ అన్నాడు...

Published : 31 Jul 2020 12:41 IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను పొగిడిన వసీం అక్రమ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు నిర్వహించే పీఎస్‌ఎల్‌ కన్నా బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్‌ టోర్నీయే అతి పెద్దదని ఆ జట్టు దిగ్గజ బౌలర్‌ వసీం అక్రమ్‌ అన్నాడు. మాజీ క్రికెటర్‌ తన్వీర్‌ అహ్మద్‌తో యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడిన వసీం ఐపీఎల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ ఈ మెగా టోర్నీని ఘనంగా నిర్వహిస్తోందని, భారీ మొత్తం వెచ్చిస్తోందని చెప్పాడు. పీఎస్‌ఎల్‌తో పోలిస్తే ఐపీఎల్‌ అత్యుత్తమమని ప్రశంసించాడు.

‘ఐపీఎల్‌ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారు. అదే విధంగా అధిక ఆదాయం లభిస్తోంది. అలా వచ్చిన డబ్బును బీసీసీఐ దేశవాళీ క్రికెట్‌ కోసం ఉపయోగిస్తోంది. దాంతో భారత్‌లోని ప్రతిభగల యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. ఐపీఎల్‌లో ఆటగాళ్లను కొనేందుకు ఒక జట్టు బడ్జెట్‌ రూ.60-80 కోట్లు ఉంటుంది. అది పీఎస్ఎల్‌ కన్నా రెండింతలు ఎక్కువ. ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లు వ్యక్తిగత కోచ్‌లను ఏర్పాటు చేసుకుంటారు. తద్వారా పూర్తిస్థాయిలో సన్నద్ధమై.. ఆత్మవిశ్వాసంతో ఆడతారు’ అని అక్రమ్‌ వివరించారు. అక్రమ్‌ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బౌలింగ్‌ కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని