
‘D’ అంటే డీన్‌జోన్స్..
దివంగత క్రికెటర్‌కు పీఎస్‌ఎల్‌లో నివాళులు
ఇంటర్నెట్‌డెస్క్: కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మార్చిలో అర్ధాంతరంగా ఆగిపోయిన పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైంది. అప్పుడు లీగ్ దశ పూర్తికాగా కేవలం ప్లేఆఫ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఐపీఎల్ కూడా పూర్తవడంతో దాయాది దేశంలో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం తొలి క్వాలిఫయర్‌లో ముల్తాన్ సుల్తాన్స్ x కరాచి కింగ్స్ తలపడ్డాయి. మరో మ్యాచ్‌లో లాహోర్ కలందార్స్ x పెషావర్ జాల్మీ పోటీపడ్డాయి. అయితే, మ్యాచ్‌కు ముందు ముల్తాన్, కరాచీ ఆటగాళ్లు ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ డీన్‌జోన్స్‌కు నివాళులర్పించారు.
ఐపీఎల్ సమయంలో ఓ క్రీడాఛానల్‌తో కలిసి పనిచేసేందుకు జోన్స్ భారత్‌కు వచ్చారు. సెప్టెంబర్ 19న యూఏఈలో మెగా టీ20 లీగ్ ప్రారంభమవ్వగా అదే నెల 24న ముంబయిలోని ఓ స్టార్‌హోటల్‌లో ఆయన గుండెపోటుకు మృతిచెందాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సూపర్ లీగ్ పునఃప్రారంభమైన వేళ ఆ రెండు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అతడికి నివాళులర్పించారు. D అనే ఆకారంలో నిలబడి శ్రద్ధాంజలి ఘటించారు. కాగా, ఈ వీడియోను పీఎస్‌ఎల్ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున లైక్ చేశారు. కాగా, డీన్ 1984 నుంచి 1992 వరకు 8 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. మొత్తం 52 టెస్టులు, 164 వన్డేలాడాడు. టెస్టుల్లో 46.55 సగటుతో 3,631 పరుగులు చేయగా, వన్డేల్లో 44.61 సగటుతో 6,068 పరుగులు సాధించాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.