Updated : 27 Oct 2021 01:58 IST

T20 World Cup: న్యూజిలాండ్‌పై పాక్‌ విజయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో టీమిండియాను ఓడించిన పాక్.. నేడు షార్జా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది.
మహ్మద్‌ రిజ్వాన్‌ (33; 34 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. పది ఓవర్ల తర్వాత కివీస్ బౌలర్లు పుంజుకుని పాక్‌ బ్యాటర్లని కట్టడి చేశారు. ఈ క్రమంలోనే పాక్‌ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలోకి వెళ్లింది. చివర్లో ఆసిఫ్‌ అలీ (27; 12 బంతుల్లో 3 సిక్స్‌లు, 1 ఫోర్‌), షోయబ్ మాలిక్ (26; 20 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్‌) ధాటిగా ఆడి పాక్‌ని విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో సోధీ రెండు, శాంటర్న్, టిమ్‌ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మిచెల్‌ (27; 20 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు), కాన్వే (27; 24 బంతుల్లో 3 ఫోర్లు), కేన్ విలియమ్సన్‌ (25; 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) తలో చేయివేయడంతో పాక్‌ ముందు ఆ మాత్రం లక్ష్యానైనా ఉంచగలిగింది. పాక్‌ బౌలర్లలో రవూఫ్‌ నాలుగు వికెట్లతో ఆకట్టుకోగా.. హాఫీజ్‌, ఇమాద్ వసీమ్, షాహీన్ ఆఫ్రిది తలో వికెట్‌ పడగొట్టారు.

 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని