ఇంటికొచ్చేస్తున్నా: పాండ్య

టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య తిరిగి స్వదేశానికి రానున్నాడు. టెస్టు సిరీస్‌ ఆడే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. కుటుంబంతో కాస్త నాణ్యమైన సమయం గడపాలని కోరుకుంటున్నానని వెల్లడించాడు. బ్యాటుతో చెలరేగుతున్న అతడు జట్టు యాజమాన్యం ఆదేశిస్తే సుదీర్ఘ...

Updated : 09 Dec 2020 04:27 IST

సిడ్నీ: టీమ్‌ఇండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్య తిరిగి స్వదేశానికి రానున్నాడు. టెస్టు సిరీస్‌ ఆడే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. కుటుంబంతో కాస్త నాణ్యమైన సమయం గడపాలని కోరుకుంటున్నానని వెల్లడించాడు. బ్యాటుతో చెలరేగుతున్న అతడు జట్టు యాజమాన్యం ఆదేశిస్తే సుదీర్ఘ ఫార్మాట్‌కు అందుబాటులో ఉంటానని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.

వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత హార్దిక్‌ పాండ్య ఏడాది కాలం బౌలింగ్‌ చేయలేదు. కాగా బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ సాధించనప్పటికీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీసులో అతడు కొన్ని ఓవర్లు విసరాల్సి వచ్చింది. అయితే బ్యాటుతో దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్‌ మాదిరిగానే ఆసీస్‌పై వీరబాదుడు బాదేశాడు. ఈ క్రమంలోనే సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడతారా అని ప్రశ్నించగా.. ‘జట్టు యాజమాన్యం అడిగితే తప్పకుండా ఆడతాను’ అని చెప్పిన సంగతి తెలిసిందే. కానీ రెండు రోజుల్లోనే తన ఉద్దేశం మార్చుకున్నాడు.

‘నేను తిరిగి ఇంటికి వచ్చేస్తున్నా. కుటుంబ సభ్యులతో కలిసి నాణ్యమైన సమయం గడపాలని భావిస్తున్నా. నా బిడ్డను నాలుగు నెలలుగా చూడలేదు. అందుకే వారితో సమయం ఆస్వాదించాలని కోరుకుంటున్నా’ అని పాండ్య అన్నాడు. టెస్టుల్లో పునరాగమనం గురించి ప్రశ్నించగా ‘భవిష్యత్తులో ఉంటుంది. బహుశా ఎప్పుడో తెలియదు’ అని బదులిచ్చాడు. ఇక ఆసీస్‌తో టీ20 సిరీసులో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గెలిచినందుకు అతడు సంతోషం వ్యక్తం చేశాడు.

‘చాలా సంతోషంగా ఉంది. మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ ఇస్తే మంచిదే కదా. అయితే సిరీస్‌ విజయానికి మా జట్టంతా కృషి చేసింది. మొదట వరుసగా రెండు వన్డేలు ఓడిపోయాక మేం నాలుగు వన్డేల సిరీస్‌ ఆడుతున్నట్టు భావించాం. టీ20 సిరీస్‌ను అందులో భాగంగానే ఆడుతున్నట్టు ప్రణాళికలు వేసుకున్నాం. విజయం సాధించాం’ అని పాండ్య తెలిపాడు.

ఇదీ చదవండి.. 

హార్దిక్‌ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా!

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని