
Updated : 09 Nov 2021 08:10 IST
Kapil Dev: ఐపీఎల్ కాదు.. దేశం ముఖ్యం
దిల్లీ: భారత ఆటగాళ్లు ఐపీఎల్‌కు కాకుండా దేశానికి ప్రాముఖ్యత ఇవ్వాలని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ‘‘భారత క్రికెటర్లు దేశానికి కాకుండా ఐపీఎల్‌కు ప్రాముఖ్యత ఇస్తుంటే ఏమని మాట్లాడగలం. దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని ప్రతి ఒక్క ఆటగాడు గొప్ప గౌరవంగా భావించాలి. ఫ్రాంఛైజీ కంటే భారత జట్టుకు ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. నా ఉద్దేశం ఐపీఎల్ ఆడొద్దని కాదు.. మన క్రికెట్ మరింత మెరుగయ్యేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. టీ20 ప్రపంచకప్‌లో చేసిన తప్పిదాలను మళ్లీ చేయకూడదు’’ అని కపిల్ పేర్కొన్నాడు. ఆటగాళ్లకు విరామం ఉండాలని.. అప్పుడే తాజాగా ఉంటారని కపిల్ అన్నాడు.
Tags :