ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పృథ్వీషా ‘వావ్‌’ క్యాచ్‌

ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా వావ్‌ అనిపించే క్యాచ్‌ పట్టాడు. సోమవారం ఆ జట్టు వికెట్‌ కీపర్‌ టిమ్‌పైన్‌(44) పరుగుల వద్ద బ్యాటింగ్‌...

Updated : 07 Dec 2020 22:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా ఏతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీషా వావ్‌ అనిపించే క్యాచ్‌ పట్టాడు. సోమవారం ఆ జట్టు వికెట్‌ కీపర్‌ టిమ్‌పైన్‌(44) పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఓ షార్ట్‌పిచ్‌ బంతిని పుల్‌ చేశాడు. అది నేరుగా బ్యాక్‌వర్డ్‌ షార్ట్‌లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న పృథ్వీ తలపై నుంచి వెళ్లడంతో ఒంటి చేతితో అందుకున్నాడు. దాన్ని అందుకునే క్రమంలో పృథ్వీ వెనక్కి వంగుతూ కనిపించాడు. అలాగే బంతిని ఒడిసిపట్టడంతో పైన్‌ అర్ధశతకం పూర్తికాక ముందే పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు క్రిస్‌గ్రీన్‌(114*)తో కలిసి అతడు ఆరో వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. 

ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ ఏ 286/8తో నిలిచింది. ప్రస్తుతం ఇండియా ఏ కన్నా ఆ జట్టు 39 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత జట్టులో కెప్టెన్‌ అజింక్య రహానె (117*) శతకంతో చెలరేడంతో 247/9 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్ చేశాడు. అంతకుముందు ఓపెనర్లిద్దరూ పృథ్వీషా(0), శుభ్‌మన్‌గిల్‌(0) డకౌటయ్యారు. ఆపై పుజారా(54), రహానె బాధ్యతగా ఆడడంతో ఇండియా ఏ మంచి స్కోర్‌ సాధించింది. కాగా, పృథ్వీ పట్టిన క్యాచ్‌ను ఓ క్రికెట్‌ వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది.

ఇవీ చదవండి..

కోహ్లీ చేసిన రనౌట్‌ చూస్తే ఏదైనా గుర్తొస్తుందా?

ఏడాదిగా కోహ్లీసేన జైత్రయాత్ర.. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని