అతడో చిట్టి సెహ్వాగ్ వెర్షన్‌

దిల్లీ జట్టు ఓపెనర్‌ పృథ్వీ షాను ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు గ్రేమ్‌ స్వాన్‌ కొనియాడాడు. విధ్వంసకర మాజీ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్‌ చిట్టి వెర్షన్‌గా షాను పోల్చాడు. ‘‘దిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్‌

Published : 18 Oct 2020 02:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీ జట్టు ఓపెనర్‌ పృథ్వీ షాను ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు గ్రేమ్‌ స్వాన్‌ కొనియాడాడు. విధ్వంసకర మాజీ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్‌ చిట్టి వెర్షన్‌గా షాను పోల్చాడు. ‘‘దిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్‌ జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం కోచ్‌ రికీ పాంటింగ్‌ నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో ఆడిన సమయంలో అతడిని అలా చూడలేదు. అంటే దిల్లీ శిబిరం ఎంతో గొప్పగా సాగుతోందనుకుంటా. ఇక, ఓపెనర్ పృథ్వీ షా బాగా ఆడుతున్నాడు. అతడి బ్యాటింగ్‌ శైలి ఎంతో నచ్చింది. షా బేబీ సెహ్వాగ్‌లా ఉన్నాడు. ఆల్‌టైమ్‌ భారత ఆటగాళ్లలో నాకు ఎంతో ఇష్టమైన ‘సెహ్వాగ్ చిట్టి వెర్షన్‌’లా ఆడుతున్నాడు’’ అని పేర్కొన్నాడు.

ఈ సీజన్‌లో పృథ్వీ షా రాణిస్తున్నాడు. ఆది నుంచే దూకుడుగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 149.62 స్ట్రైక్‌రేట్‌తో 202 పరుగులు చేశాడు. ఇక యువజట్టు దిల్లీ తొలి టైటిల్ సాధించాలని పట్టుదలతో ఆడుతోంది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి మొదటి స్థానంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని