Updated : 10/10/2020 17:43 IST

కార్తిక్‌ ధనాధన్‌‌.. పంజాబ్‌ లక్ష్యం 165

ఇంటర్నెట్‌డెస్క్‌: సారథి దినేశ్‌ కార్తిక్‌ (58; 29 బంతుల్లో, 8×4, 2×6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడటంతో పంజాబ్‌కు కోల్‌కతా 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. అయితే కోల్‌కతాకు శుభారంభం దక్కలేదు. ఆది నుంచే తడబడుతూ బ్యాటింగ్‌ చేసిన రాహుల్‌ త్రిపాఠి (4; 10 బంతుల్లో, 1×4)ని మూడో ఓవర్‌లో షమి క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. కొద్దిసేపటికే వన్‌డౌన్‌లో వచ్చిన రాణా (2; 4 బంతుల్లో) రనౌటయ్యాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మోర్గాన్‌ (24; 23 బంతుల్లో, 2×4, 1×6)తో కలిసి శుభ్‌మన్‌ గిల్‌ (57; 47 బంతుల్లో, 4×5) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే దూకుడుగా ఆడే యత్నంలో బిష్ణోయ్‌ బౌలింగ్‌లో మోర్గాన్‌ వెనుదిరిగాడు.

తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కార్తిక్‌ ఇన్నింగ్స్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ఆది నుంచే దూకుడుగా ఆడుతూ బౌండరీల మోత మోగించాడు. అర్షదీప్ వేసిన 15వ ఓవర్‌లో మూడు బౌండరీలు బాదిన అతడు జోర్డాన్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకాన్ని సాధించాడు. మరోవైపు గిల్ కూడా నిలకడగా ఆడుతూ 42 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 18వ ఓవర్‌లో రెండో పరుగుకు ప్రయత్నించి గిల్ రనౌటయ్యాడు. 13 ఓవర్లకు 75 పరుగులు చేసిన కోల్‌కతా.. ఆఖరి 7 ఓవర్లలో 89 పరుగులు చేసింది. రసెల్‌ (5) మరోసారి నిరాశపరిచాడు. పంజాబ్‌ బౌలర్లలో షమి, అర్షదీప్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని