ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత నాదల్‌ 

ఎర్రమట్టి కోర్టులో మరోసారి రఫెల్‌ నాదెల్ విజయకేతనం ఎగరవేశాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో నొవాక్‌ జకోవిచ్‌పై 6-0, 6-2; 7-5

Published : 12 Oct 2020 01:07 IST

ఫైనల్లో జకోవిచ్‌పై విజయం

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎర్రమట్టి కోర్టులో మరోసారి రఫెల్‌ నాదెల్ విజయకేతనం ఎగురవేశాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో నొవాక్‌ జకోవిచ్‌పై 6-0, 6-2; 7-5  తేడాతో విజయం సాధించి టైటిల్ గెలిచాడు. తొలిసెట్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన అతడు రెండో సెట్‌లోనూ జకోవిచ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇక హోరాహోరీగా సాగిన మూడో సెట్‌లో పైచేయి సాధించి టైటిల్‌ సాధించాడు. దాంతో ఈ టోర్నీలో నాదల్ చేతిలో జకోవిచ్‌ మూడుసార్లు ఓటమి చవిచూశాడు. అయితే ఈ విజయంతో నాదల్‌ 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఫెదరర్‌ సరసన నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని