దాదా రక్షించు.. శాస్త్రీ దిగిపో!

ఆస్ట్రేలియాతో జరిగిన గులాబి టెస్టులో టీమ్‌ఇండియా ఘోర పరాజయం చవిచూసింది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలింది. ఇలాంటి చెత్త ప్రదర్శనకు కారణం కోచ్‌ రవిశాస్త్రే అని నెటిజన్లు విమర్శిస్తున్నాడు. ఆయనను కోచ్‌గా తొలగించి రాహుల్ ద్రవిడ్‌ లేదా...

Published : 20 Dec 2020 02:28 IST

టీమ్‌ఇండియా కోచ్‌పై నెటిజన్ల విమర్శలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాతో జరిగిన గులాబి టెస్టులో టీమ్‌ఇండియా ఘోర పరాజయం చవిచూసింది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలింది. ఇలాంటి చెత్త ప్రదర్శనకు కారణం కోచ్‌ రవిశాస్త్రే అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఆయనను కోచ్‌గా తొలగించి రాహుల్ ద్రవిడ్‌ లేదా అలాంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు. దయచేసి భారత క్రికెట్‌ను రక్షించండి అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని అభ్యర్థిస్తున్నారు.

అడిలైడ్‌ వేదికగా జరిగిన గులాబి టెస్టు తొలి రెండు రోజులు ఆసక్తికరంగా సాగింది. విరాట్‌ కోహ్లీ (74), ఛెతేశ్వర్‌ పుజారా (43), అజింక్య రహానె (42) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 244 పరుగులు చేసింది. ఇదే తక్కువ స్కోరని భావిస్తే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 191 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ (4), ఉమేశ్‌ యాదవ్‌ (3), బుమ్రా (2) ఆ జట్టును దెబ్బకొట్టారు. 50+ ఆధిక్యం లభించడంతో టీమ్‌ఇండియా గెలుపుకు బాటలు వేసుకుంటుందని అంతా అనుకున్నారు.

ఇందుకు విరుద్ధంగా కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్‌లో 21.2 ఓవర్లలో కేవలం 39 పరుగులకే చాప చుట్టేసింది. ఒక్క బ్యాట్స్‌మన్‌ సైతం రెండంకెల పరుగులు చేయలేదు. జోష్‌ హేజిల్‌వుడ్‌ 5/8, కమిన్స్‌ 4/21 చుక్కలు చూపించారు. భారత్‌ ఘోర పరాజయం పాలవ్వడంతో ఇందుకు రవిశాస్త్రినే నెటిజన్లు మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు.

ఇవీ చదవండి
పెద్ద జట్లు.. చిన్న స్కోర్లు: ఎందుకీ విలవిల?
భారత్‌‌ తప్పుకాదు..ఓటీపీని మరిచిపోవాలి

 







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని