ట్రోఫీతో పాటు ఊరిస్తున్న రికార్డులివే

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 లీగ్‌ 13వ సీజన్‌ విజేతను తేల్చే మ్యాచ్‌ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే అందరి నమ్మకాన్ని నిలబెడుతూ ఫెనల్‌ చేరిన ముంబయి ఓవైపు.. ఈసారి అత్యుత్తమ..

Published : 10 Nov 2020 10:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 లీగ్‌ 13వ సీజన్‌ విజేతను తేల్చే మ్యాచ్‌ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే అందరి నమ్మకాన్ని నిలబెడుతూ ఫెనల్‌ చేరిన ముంబయి ఓవైపు.. ఈసారి అత్యుత్తమ ప్రదర్శనతో మేటి జట్లను మట్టికరిపించి కొండంత ఆత్మవిశ్వాసంతో తొలిసారి ఫైనల్‌ చేరిన దిల్లీ మరోవైపు. గత రికార్డులు ఎలా ఉన్నా సరే.. ఇది టీ20. ఫలితాన్ని ఎవరూ ముందే నిర్ణయించలేరు. ఈసారి ట్రోఫీని ముద్దాడేదెవరో తెలుసుకోవాలంటే మ్యాచ్‌ ముగిసే వరకూ వేచి చూడాల్సిందే. మరి కీలకమైన ఈ మ్యాచ్‌లో ట్రోఫీతో పాటు కొన్ని రికార్డులు ఆటగాళ్లను ఊరిస్తున్నాయి. అవేంటో తెలుసా..? ఇవే రికార్డులు..

* ఈ మ్యాచ్‌తో రోహిత్‌శర్మ టీ20లీగ్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంటాడు. 
* 4,000 పరుగుల మైలురాయికి హిట్‌మ్యాన్‌ మరో 8 పరుగుల దూరంలో ఉన్నాడు. 
* మరో రెండు సిక్సర్లు బాదితే ముంబయి ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ టీ20 లీగ్‌లో 200 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు.
* దిల్లీ ఆటగాడు శిఖర్ ధావన్‌ టీ20లీగ్‌లో 1,500 పరుగులకు మరో 36 పరుగుల దూరంలో ఉన్నాడు. దిల్లీ తరఫున గబ్బర్‌ ఇప్పటి వరకూ 1,464 పరుగులు చేశాడు.

* ఈ మ్యాచ్‌తో ధావన్‌కు టోర్నీలో టాప్‌స్కోరర్‌ అయ్యే అవకాశం ఉంది. మరో 68 పరుగులు చేస్తే పంజాబ్‌ ఆటగాడు కెఎల్‌.రాహుల్‌ (670)ను గబ్బర్‌ అధిగమిస్తాడు.
* దిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ముందు కూడా ఓ రికార్డు ఉంది. మరో 46 పరుగులు చేస్తే అతను ఈ సీజన్‌లో 500 పరుగులు చేసిన ఆటగాడవుతాడు.

ఈ మైదానం ముంబయికి ప్రతికూలమే..!
ఈ మైదానంలో ఇప్పటి వరకూ ముంబయి ఆడిన 7 మ్యాచుల్లో ఐదింట్లో ఓడింది. కేవలం రెండు మ్యాచుల్లోనే విజయం సాధించింది. మరోవైపు ఇదే మైదానంలో 10మ్యాచ్‌లాడిన దిల్లీ 5 విజయాలు, 5 ఓటములతో మిశ్రమ ఫలితాలు రాబట్టింది. ఈ రెండు జట్లు 27 మ్యాచుల్లో ఎదురుపడగా.. అందులో ముంబయి - 15, దిల్లీ - 12 విజయాలు సాధించాయి. కాగా.. ఈ సీజన్‌లోనే శ్రేయస్‌ జట్టుపై రోహిత్‌సేన మూడు మ్యాచుల్లో గెలుపొంది ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే.. ముంబయికి అంతగా కలిసిరాని ఈ దుబాయ్‌ మైదానం దిల్లీకి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి మరి.!

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts