ఆస్ట్రేలియాపై పంత్‌ కొత్త రికార్డు..

టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ ఆస్ట్రేలియాలో కొత్త రికార్డు సృష్టించాడు. ఆ గడ్డపై వరుసగా 8 ఇన్నింగ్స్‌ల్లో 25, అంతకన్నా ఎక్కువ పరుగులు సాధించిన విదేశీ ఆటగాడిగా...

Updated : 27 Dec 2020 14:21 IST

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ రిషభ్‌పంత్‌ ఆస్ట్రేలియాలో కొత్త రికార్డు సృష్టించాడు. ఆ గడ్డపై వరుసగా 8 ఇన్నింగ్స్‌ల్లో 25, అంతకన్నా ఎక్కువ పరుగులు సాధించిన విదేశీ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ వాలీ హేమండ్‌, పార్సీ ఇండియన్‌ రూసి సుర్తి, విండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ కంగారూలపై ఈ ఘనత సాధించారు. 

మరోవైపు 2018 నుంచీ టీమ్‌ఇండియా తరఫున ఆడుతున్న పంత్‌ గత ఆసీస్‌ పర్యటనలో 4 టెస్టులు ఆడాడు. అందులో వరుసగా 25, 28, 36, 30, 39, 33, 159* పరుగులు చేశాడు. దీంతో భారత్‌ తరఫున పుజారా(521) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పంత్‌(350) నిలిచాడు. ఈ నేపథ్యంలోనే తాజా పర్యటనలో తొలి టెస్టు ఆడని అతడు రెండో టెస్టుకు ఎంపికయ్యాడు. ఆదివారం తొలి ఇన్నింగ్స్‌లో హనుమ విహారి ఔటయ్యాక క్రీజులోకి వచ్చాడు.

కెప్టెన్‌ అజింక్య రహానెతో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పుతున్నాడనే క్రమంలో 29 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఔటయ్యాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదో వికెట్‌ కోల్పోయింది. ఈ క్రమంలోనే పంత్‌ వరుసగా 8 ఇన్నింగ్స్‌లో 25, అంతకన్నా ఎక్కువ పరుగులు సాధించాడు. 

ఇవీ చదవండి..
తండ్రి కల నెరవేరింది.. సిరాజ్ భావోద్వేగం

ఇదేం అంపైరింగ్‌? బాక్సింగ్ డే టెస్టుపై రచ్చ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని