కొడుకుతో సానియా సరదా.. సరదా

భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్‌ మీర్జాతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తోంది. అతడి చిన్నారి చిలిపి చేష్టలను విపరీతంగా ఆనందిస్తోంది. అతడితో కలిసి ఆడుతూ పాడుతూ సరదగా కాలం గడుపుతోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆమె...

Published : 04 Dec 2020 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్‌ మీర్జాతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తోంది. అతడి చిన్నారి చిలిపి చేష్టలను విపరీతంగా ఆనందిస్తోంది. అతడితో కలిసి ఆడుతూ పాడుతూ సరదగా కాలం గడుపుతోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలను ఆమె క్రమం తప్పకుండా సోషల్‌మీడియాలో పంచుకుంటోంది. తాజాగా తన కుమారుడితో కలిసి దిగిన చిత్రాన్ని ఆమె ఇన్‌స్టాలో పెట్టారు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.

కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల ప్రస్తుతం టెన్నిస్‌ టోర్నీల్లో సానియా ఎక్కువగా పాల్గొనడం లేదు. పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను పెళ్లాడిన ఆమె కుమారుడికి జన్మనిచ్చాక 23 కిలోల బరువు తగ్గింది. ఎన్నో కష్టమైన కసరత్తులు చేసి, కఠినమైన ఆహారపు నిబంధనలు పాటించింది. మొదట్లో మళ్లీ టెన్నిస్‌ ఆడతాననుకోలేదని అయితే తనకిష్టమైన ఆటకోసం అలుపెరగక శ్రమించానని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గర్భధారణ, మాతృత్వం, కెరీర్‌ గురించి భావోద్వేగంతో ఆమె ఈ మధ్యే ఓ లేఖను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని