కోహ్లీని కాపాడిన ధోనీ: మంజ్రేకర్‌

ఒకానొక సందర్భంలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జట్టులో స్థానం కోల్పోయే వాడని, ఆ ప్రమాదం నుంచి మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ రక్షించాడని మాజీ క్రికెటర్‌...

Updated : 15 Dec 2020 16:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకానొక సందర్భంలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జట్టులో స్థానం కోల్పోయే వాడని, ఆ ప్రమాదం నుంచి మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ రక్షించాడని మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌ వెల్లడించాడు. తాజాగా అతడు ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2011-2012 సీజన్‌లో టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇలా జరిగిందని చెప్పాడు. అప్పుడు కోహ్లీ వరుసగా ఆరు టెస్టుల్లో విఫలమయ్యాడని, దాంతో సిడ్నీ టెస్టు తర్వాత అతడికి జట్టులో స్థానం కష్టమైందని మంజ్రేకర్‌ పేర్కొన్నాడు. అయితే, అదే సమయంలో కెప్టెన్‌ ధోనీ అండగా నిలిచాడని, దాంతో తర్వాతి టెస్టులో 75 పరుగులు సాధించి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడని వివరించాడు. ఇక తర్వాత అడిలైడ్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో కోహ్లీ తొలి టెస్టు శతకం నమోదు చేశాడని మాజీ క్రికెటర్‌ పేర్కొన్నాడు. ఆ సిరీస్‌లో టీమ్‌ఇండియా తరఫున అదొక్కటే సెంచరీ అని గుర్తుచేసుకున్నాడు. ఇదిలాఉండగా, ఆ సిరీస్‌లో భారత్‌ 0-4 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 

ఇవీ చదవండి..
పుజారా ఉండగ.. భయమెందుకు దండగ! 
షమి, బుమ్రా: 20 కంగారూల వేట!

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని