Afridi - Akhtar: షోయబ్‌ మంచోడే కానీ...

పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ బుల్లెట్‌ బంతులతోనే కాదు వివాదాల వల్ల కూడా బాగా గుర్తుండిపోతాడనే సంగతి తెలిసిందే. 2007లో దక్షిణాఫ్రికాలో టీ20 ప్రపంచ సందర్భంగా సహచర పేసర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ను బ్యాటుతో కొట్టడంతో పాకిస్థాన్‌...

Published : 17 May 2021 01:30 IST

2007లో షోయబ్‌ బ్యాట్‌ విసరడంపై స్పష్టత..

కరాచి: పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ బుల్లెట్‌ బంతులతోనే కాదు వివాదాల వల్ల కూడా బాగా గుర్తుండిపోతాడనే సంగతి తెలిసిందే. 2007లో దక్షిణాఫ్రికాలో టీ20 ప్రపంచ సందర్భంగా సహచర పేసర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ను బ్యాటుతో కొట్టడంతో పాకిస్థాన్‌ బోర్డు వెంటనే అతడిని స్వదేశానికి రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన గురించి అక్తర్‌ తన ఆత్మకథలోనూ ప్రస్తావించాడు. అప్పట్లో ఘర్షణ తీవ్రం కావడానికి కారణం షాహిద్‌ అఫ్రిది అని పేర్కొంటూ మాజీ పేసర్‌ నిందించాడు.

‘‘అఫ్రిది వల్ల గొడవ పెద్దదైంది. నేను వాళ్లిద్దరిని బ్యాటుతో కొట్టా. అఫ్రిది తప్పించుకున్నాడు. కానీ ఆసిఫ్‌ తొడకు బ్యాట్‌ తగిలింది. అతడు కిందపడిపోయాడు. నేను పూర్తిగా నియంత్రణ కోల్పోయా. అప్పుడు తప్ప నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు. ముఖ్యంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో’’ అని అక్తర్‌ అందులో వివరించాడు. అయితే, ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన అఫ్రిది.. ఆ సమయంలో తాను జోక్‌ చేయడమే ఆ గొడవకు దారితీసిందని చెప్పాడు. ‘‘అలాంటివి జరుగుతుంటాయి. కొందరు జోక్‌లను సరదాగా తీసుకుంటారు. మరికొందరు అలా తీసుకోరు. నేను అప్పుడు పరిస్థితిని చక్కబెట్టేందుకే వాళ్ల మధ్యకి వెళ్లాను. నేను, ఆసిఫ్‌ ఏదో జోక్‌తో నవ్వుకోవడంతో అతడికి కోపమొచ్చింది. ఆ తర్వాతే అదంతా జరిగింది. కానీ, అక్తర్‌ది మంచి మనసు’’ అని అఫ్రిది అసలు విషయం బయటపెట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని