బాక్సింగ్‌డేలో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం

శనివారం నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్‌ డే టెస్టులో టీమ్‌ఇండియాపై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తుందని మాజీ స్పిన్నర్‌‌ షేన్‌వార్న్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా అతడు మీడియాతో...

Updated : 24 Dec 2020 13:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శనివారం నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్‌ డే టెస్టులో టీమ్‌ఇండియాపై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తుందని మాజీ స్పిన్నర్‌‌ షేన్‌వార్న్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా అతడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అడిలైడ్‌ టెస్టులో ఘోర పరాజయం నుంచి టీమ్ఇండియా ఇంకా కోలుకోలేదని, ఆటగాళ్లు ఇంకా షాక్‌లోనే ఉన్నారని వార్న్‌ పేర్కొన్నాడు. భారత జట్టులో కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, అజింక్య రహానె, పుజారా లాంటి క్లాస్‌ ప్లేయర్స్‌ ఉన్నారని, అయినా కంగారూలు పైచేయి సాధిస్తారని చెప్పాడు. 

మరోవైపు షమి లాంటి అనుభవజ్ఞుడు లేకపోవడం భారత జట్టుకు ప్రతికూలమని, మెల్‌బోర్న్‌ లాంటి పిచ్‌కు అతడి బౌలింగ్‌ సరిపోతుందని షేన్‌వార్న్‌ అభిప్రాయపడ్డాడు. ఇక తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారని విమర్శించడం కన్నా తమ పేసర్లు హేజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌ అద్భతంగా రాణించారని ప్రశంసించడం ఉత్తమమని చెప్పాడు. ఇక స్టార్క్‌, నాథన్‌ లైయన్‌ కూడా చాలాకాలంగా మంచి ప్రదర్శన చేస్తున్నారని కొనియాడాడు. ఈ నలుగురు ఆస్ట్రేలియా తరఫున అత్యుత్తమ బౌలింగ్‌ దళమని పేర్కొన్నాడు. 

ఇవీ చదవండి..
కోహ్లీ కోసం ధోనీ త్యాగం.. !
కోహ్లీ స్థానంలో సెహ్వాగ్‌ ఉంటే..?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని