ముంబయి ఇలాగే కొనసాగితే అంతే సంగతి!

ముంబయి జట్టు కొన్నేళ్ల పాటు ఇదే ఆటగాళ్లతో కొనసాగితే భవిష్యత్‌లోనూ ఓడించడం కష్టమని చెన్నై మాజీ బ్యాట్స్‌మన్‌ షేన్‌వాట్సన్‌ అన్నాడు. తాజాగా దిల్లీని ఓడించిన ముంబయి 13వ సీజన్‌లోనూ విజేతగా నిలిచి ఐదోసారి...

Published : 12 Nov 2020 16:30 IST

భవిష్యత్‌లోనూ ఓడించడం కష్టం: షేన్‌వాట్సన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ముంబయి జట్టు కొన్నేళ్ల పాటు ఇదే ఆటగాళ్లతో కొనసాగితే భవిష్యత్‌లోనూ ఓడించడం కష్టమని చెన్నై మాజీ బ్యాట్స్‌మన్‌ షేన్‌వాట్సన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా దిల్లీని ఓడించిన ముంబయి 13వ సీజన్‌లోనూ విజేతగా నిలిచి ఐదోసారి కప్పు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టును అభినందిస్తూ వాట్సన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడాడు. ఈ సీజన్‌లో రోహిత్‌ సేన అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని, ఆ జట్టును వేలెత్తి చూపడానికి ఏమీ లేదని పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఆడినన్ని రోజులూ ఆ జట్టు మెరుగవుతూనే ఉందన్నాడు. 

‘ముంబయి జట్టుకు రోహిత్‌ శర్మ, క్వింటన్‌ డికాక్‌ లాంటి ప్రపంచ శ్రేణి ఓపెనర్లు ఉన్నారు. తర్వాత సూర్యకుమార్‌ యాదవ్‌. అతడు నిలకడగా రాణిస్తున్నాడు. త్వరలోనే టీమ్‌ఇండియాలో ఆడే అవకాశం ఉంది. అతడికి ఈ సీజన్‌ మంచిగా మిగిలిపోతుంది. ఇక ఇషాన్‌ కిషన్‌ తన వంతు పాత్ర పోషించాడు. రోహిత్‌ లేనపపుడు ఓపెనర్‌గా ఆడినా, అవసరాన్ని బట్టి మిడిల్‌ ఆర్డర్‌లో బరిలోకి దిగినా అద్భుతంగా రాణించాడు. ఆపై హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌ లాంటి అత్యుత్తమ ఫినీషర్లు ఉండడంతో ఆ జట్టు బలంగా ఉంది. వీరందరినీ పరిగణలోకి తీసుకుంటే ముంబయిని ఓడించడం కష్టతరం. మరికొన్నేళ్లు ఇదే జట్టుతో కొనసాగితే భవిష్యత్‌లో ఇంకా ప్రమాదకరంగా మారుతుంది’ అని వాట్సన్‌ వివరించాడు. కాగా, ఈ ఏడాది చెన్నై తరఫున చివరిసారి బరిలోకి దిగిన ఈ ఆస్ట్రేలియా క్రికెటర్‌ మొత్తం 11 మ్యాచ్‌ల్లో 299 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు. ఇక ఈ టీ20 లీగ్‌ మొత్తంలో 145 మ్యాచ్‌లు ఆడగా 3,874 పరుగులు చేశాడు. అందులో నాలుగు శతకాలు, 21 అర్ధశతకాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు