టీమిండియా కొత్త జెర్సీలు చూశారా?

టీమిండియాకు కొత్త జెర్సీలు వచ్చేశాయ్‌. 1992 ప్రపంచకప్‌లో ధరించిన రెట్రో జెర్సీల మాదిరిగా నూతన జెర్సీలు ఉన్నాయి. నేవీ బ్లూలో ఉన్న ఈ కొత్త జెర్సీని ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ ధరించి

Updated : 24 Nov 2020 19:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియాకు కొత్త జెర్సీలు వచ్చేశాయ్‌. 1992 ప్రపంచకప్‌లో ధరించిన రెట్రో జెర్సీల మాదిరిగా నూతన జెర్సీలు ఉన్నాయి. నేవీ బ్లూలో ఉన్న ఈ కొత్త జెర్సీని ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ ధరించి తన ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల్లో అభిమానులతో పంచుకున్నాడు. ‘‘సరికొత్త జెర్సీ, గొప్ప ప్రేరణ, భారత్ తరఫున పోరాడటానికి సిద్ధం’’ అని దానికి వ్యాఖ్య జత చేశాడు. కాగా, కొత్త జెర్సీలకు అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే నెట్టింట్లో వైరల్‌గా మారింది.

నైక్‌తో ఒప్పందం ముగియడంతో టీమిండియా కిట్‌ కొత్త స్పాన్సర్‌, వాణిజ్య భాగస్వామిగా ‘ఎంపీఎల్ స్పోర్ట్స్‌’తో బీసీసీఐ ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎంపీఎల్ స్పోర్ట్స్‌ టీమిండియాకు కొత్త కిట్‌లను అందజేసింది. నవంబర్‌ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో కొత్త జెర్సీలతో భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. కాగా, జెర్సీలపై బీసీసీఐ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు