గిల్‌.. మంచోడు: యువీ

టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఎవరితోనూ వాగ్వాదానికి దిగడని భారత ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌ అన్నారు. మైదానంలో ఎప్పుడూ ఎవరినీ ఏమీ అనలేదని వివరించారు. 21 రోజుల శిబిరంలో పంజాబ్‌ జట్టుకు మార్గనిర్దేశం చేయడం బాగుందని పేర్కొన్నారు...

Published : 01 Aug 2020 02:00 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఎవరితోనూ వాగ్వాదానికి దిగడని భారత ప్రపంచకప్‌ల హీరో యువరాజ్‌సింగ్‌ అన్నారు. మైదానంలో ఎప్పుడూ ఎవరినీ ఏమీ అనలేదని వివరించారు. 21 రోజుల శిబిరంలో పంజాబ్‌ జట్టుకు మార్గనిర్దేశం చేయడం బాగుందని పేర్కొన్నారు. ఆట మొదలు పెట్టినప్పుడు తనకూ ఎంతో మంది మెంటార్లు ఉండేవారని గుర్తుచేసుకున్నారు. ఆటగాళ్లకు అత్యుత్తమ వసతులు కల్పిస్తున్న పంజాబ్‌ క్రికెట్‌ సంఘానికి యువీ కృతజ్ఞతలు తెలిపారు.

క్రికెట్‌, స్కేటింగ్‌ తాను ప్రేమించే క్రీడలని యువీ అన్నారు. ఇప్పుడు ఖాళీ సమయం ఉండటంతో గోల్ఫ్‌ నేర్చుకుంటున్నానని తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌ లీగులు ఆడాలని అనుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుత కరోనా కాలంలో లీగులు ఎప్పుడు మొదలవుతాయో చెప్పలేమని పేర్కొన్నారు.

యువ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ గురించి యువీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అతడి ప్రవర్తన ఎంతో బాగుంటుందని తెలిపారు. గతేడాది దిల్లీతో రంజీ మ్యాచులో అంపైర్‌ ఔటిస్తే గిల్‌ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే నిర్ణయాన్ని మాత్రమే గిల్‌ ప్రశ్నించడాన్ని యువీ వెనకేసుకొచ్చారు. తమను తాము నిరూపించుకోవాలని భావిస్తున్న యువ బ్యాట్స్‌మెన్‌ అలాగే ఉంటారన్నారు. మొదట్లో తనకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని తెలిపారు. పొరపాట్లు చేస్తే సరిదిద్దుకుంటారని పేర్కొన్నారు. గిల్‌లో ప్రత్యేక ప్రతిభ ఉందని ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని