ఎంసీజీ భారత్‌కు వెరీ స్పెషల్‌: దాదా

ప్రతికూలతల నడుమ బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించిన టీమిండియాపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తన ఎత్తులు, వ్యూహాలతో, కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును గొప్పగా నడపించిన రహానెపై ప్రశంసల...

Updated : 30 Dec 2020 13:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతికూలతల నడుమ బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించిన టీమిండియాపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తన ఎత్తులు, వ్యూహాలతో, కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును గొప్పగా నడపించిన రహానెపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్‌ మాజీ సారథి సౌరవ్ గంగూలీ టీమిండియాను కొనియాడుతూ ట్వీట్‌ చేశాడు.

‘‘మెల్‌బోర్న్‌ మైదానంలో (ఎంసీజీ) విజయం ఎంతో ప్రత్యేకం. టీమిండియా అక్కడ ఆడటానికి ఎంతో ఇష్టపడుతుంది. అజింక్య రహానె గొప్ప ప్రదర్శన చేశాడు. మంచి వాళ్లు తొందరగా ముగిస్తారు. టీమిండియాకు శుభాకాంక్షలు. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలి’’ అని దాదా ట్వీట్ చేశాడు. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద క్రికెట్‌ మైదానం అయిన ఎంసీజీలో భారత్‌కు ఇది నాలుగో విజయం. విదేశాల్లో ఆడిన టెస్టుల్లో టీమిండియాకు అత్యంత విజయవంతమైన వేదిక ఇదే.

కాగా, తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలిన చేదు జ్ఞాపకం, కీలక ఆటగాళ్ల గైర్హాజరీ, ఉమేశ్‌ యాదవ్‌ మ్యాచ్ మధ్యలోనే దూరమవ్వడం వంటి ప్రతికూలతల నడుమ టీమిండియా రెండో టెస్టులో గొప్పగా పోరాడింది. రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్‌ రహానె శతకంతో సత్తాచాటాడు. బౌలర్లు సమష్టి ప్రదర్శన చేశారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 1-1తో సమం చేసింది. సిడ్నీ వేదికగా జనవరి 7న మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి

ఇది భారత్‌.. ఎవరికీ తలవంచదు: గావస్కర్‌

కరోనా వేట.. 2020లో ఆట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని