క్రిస్మస్‌ తాతగా ఎవరో గుర్తుపట్టండి..

సచిన్‌ తెందూల్కర్‌ స్వయంగా క్రిస్మస్‌ తాత వేషంలో కనిపించి.. అభిమానులను సంతోష పెట్టాడు.

Updated : 25 Dec 2020 13:49 IST

శుభాకాంక్షలు తెలిపిన క్రీడా ప్రముఖులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. పోర్చుగీసు ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, సెర్బియా టెన్నిస్‌ లెజెండ్‌ జకోవిచ్‌ తదితరులు వీరిలో ఉన్నారు. ఇక భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ స్వయంగా క్రిస్మస్‌ తాత వేషంలో కనిపించి.. అభిమానులను సంతోష పెట్టాడు.

సచిన్‌ తెందూల్కర్‌

‘‘ప్రతి ఒక్కరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు! క్రిస్మస్‌ పండుగ ఎప్పుడూ బోధించేది సమైక్యత, దానగుణం గురించే. ఈ సందర్బంగా మనకు వీలైన చిన్న చిన్న చర్యల ద్వారా మన చుట్టూ ఉన్నవారు ప్రత్యేకంగా, అనందంగా ఉండేలా చేద్దాం. అందరికీ దీవెనలు లభించాలి’’

సురేశ్‌ రైనా

‘‘మీకు, మీ కుటుంబసభ్యులకు సంవత్సరమంతా సంతోషం, సంతృప్తి, చక్కటి విజయం లభించాలని కోరుకుంటున్నాను. 2021లో అందరూ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలి. అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు’’

రోహిత్‌ శర్మ

‘‘అందరికీ మెర్రీ క్రిస్మస్‌.. హ్యాపీ హాలీడేస్‌! మిస్‌ యూ మై గర్ల్స్‌.. (భార్య, కుమార్తె గురించి)’’

రికీ పాంటింగ్‌

‘‘ప్రతి ఒక్కరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు. ఈ సారి పండగను నా తల్లితండ్రులు, కుటుంబంతో కలిసి జరుపుకోవటం, దీనిని మీ అందరితో పంచుకోవటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’’

హర్షా భోగ్లే

‘‘అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు. ఈ పండుగ మంచి భవిష్యత్తుకు దారితీయగలదని కోరుకుంటున్నాను’’

బ్రెట్‌ లీ

‘‘ప్రతి ఒక్కరికీ మెర్రీ క్రిస్మస్‌, హ్యాపీ న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు! క్రిస్మస్‌ తాత వచ్చే వరకు కాస్త నిద్రపోతా.. బాక్సింగ్‌ డే పరీక్ష వరకు మరి కాసేపు..’’

క్రిస్టియానో రొనాల్డో

‘‘అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు. ప్రజలందరికీ పూర్తి ఆరోగ్యం, ప్రేమ, సంతోషాలు లభించాలి’’

జకోవిచ్

‘‘మెర్రీ క్రిస్మస్‌. ఈ పండుగ జరుపుకొంటున్న వారందరికీ శుభాకాంక్షలు.’’

ఇవీ చదవండి ..

ధోనీ చెప్పినట్లే చేశాడు..

ఇదేం అంపైరింగో..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని