సునీల్‌ నరైన్‌ యాక్షన్‌కు క్లీన్‌ చిట్‌ 

మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ తిరిగి కోల్‌కతా జట్టు తరఫున బౌలింగ్ చేయనున్నాడు. యూఏఈ వేదికగా జరగుతున్న మెగా టీ20 టోర్నీలో ఆడుతున్న నరైన్ అక్టోబరు 10న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వేసిన బౌలింగ్‌ యాక్షన్‌పై

Updated : 18 Oct 2020 22:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ తిరిగి కోల్‌కతా జట్టు తరఫున బౌలింగ్ చేయనున్నాడు. యూఏఈ వేదికగా జరగుతున్న మెగా టీ20 టోర్నీలో ఆడుతున్న నరైన్ అక్టోబరు 10న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో వేసిన బౌలింగ్‌ యాక్షన్‌పై అంపైర్లు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిబంధనలను అతిక్రమించి మోచేతిని ఎక్కువగా వంచి బౌలింగ్‌ చేశాడని అంపైర్లు నరైన్‌ను లీగ్‌ బౌలర్ల హెచ్చరిక జాబితాలో ఉంచారు. దీంతో ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ 16వ తేదీ ముంబయితో కోల్‌కతా పోటీ పడిన మ్యాచ్‌లో స్థానం కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోయిన విషయం తెలిసిందే.

నరైన బౌలింగ్‌పై అంపైర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా కోల్‌కతా జట్టు యాజమాన్యం లీగ్‌ బౌలింగ్‌ కమిటీని ఆశ్రయించింది. నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌కు సంబంధించిన వీడియోను కమిటీకి అందజేసింది. పంజాబ్‌ మ్యాచ్‌లో నరైన్‌ బౌలింగ్‌ యాక్షన్‌ను కమిటీ సునిశిత పరిశీలన చేసింది. ఈ మిస్టరీ స్పిన్నర్‌ నిబంధనల మేరకే మోచేయి వంచి బౌలింగ్‌ చేసినట్లు కమిటీ వివరణ ఇచ్చింది. అయితే ఈ లీగ్‌లో నరైన్‌ తర్వాత ఆడనున్న మ్యాచ్‌లతో సైతం ఈ విధంగానే బౌలింగ్‌ వేయాలని పేర్కొంది. ఇదిలా ఉంటే గతంలోనూ నరైన్‌ అంపైర్ల నుంచి ఇటువంటి హెచ్చరికలు అందుకున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని