మట్టిపాత్రలో వంట చేసిన రైనా

భారత క్రికెటర్లు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మధ్యమాల్లో పోస్టులు చేస్తూ  ఫేమస్‌ అవుతున్నారు.  క్రికెటర్‌ సురేశ్‌ రైనా తాజాగా తను ఇంట్లో వంట చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ‘శీతాకాలంలో వంట చేయడం గొప్ప అనుభూతి, అలవాటు’అని ఆ వీడియోకు యాష్‌ ట్యాగ్‌  చేసి  రైనా క్యాప్షన్‌ ఇచ్చాడు.

Updated : 20 Nov 2020 18:12 IST


ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సురేశ్‌ రైనా కుటుంబంతో గడుపుతున్న ఫొటోలు, వ్యాయామం చేస్తున్న ఫొటోలను  సామాజిక మధ్యమాల ద్వారా  అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా ఇంట్లో వంట చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ‘శీతాకాలంలో వంట చేయడం గొప్ప అనుభూతి, అలవాటు’అని ఆ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు. దీనిపై మరో క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందిస్తూ.. ‘బ్రో నా కోసం చేస్తున్నావా?’అని సరదాగా కామెంట్‌ చేశాడు. దీనిని వందల మంది అభిమానులు రీట్వీట్‌ చేశారు. ఈ వీడియోలో రైనా సాధారణ వ్యక్తిలా మట్టిపాత్రలో వంట చేయడం అభిమానులను ఆకట్టుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని