Sunil Gavaskar: బ్యాటింగ్‌ వైఫల్యం వల్లే..

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ లీగ్‌ దశలో ఇంటిముఖం పట్టడానికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు.   ‘‘మన బ్యాటర్లను స్కోరు చేయకుండా పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌

Updated : 09 Nov 2021 08:19 IST

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ లీగ్‌ దశలో ఇంటిముఖం పట్టడానికి బ్యాటింగ్‌ వైఫల్యమే కారణమని మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ అన్నాడు.   ‘‘మన బ్యాటర్లను స్కోరు చేయకుండా పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ బౌలర్లు నియంత్రించడమే మనం టీ20   ప్రపంచకప్‌లో ముందడుగు వేయనీయకుండా చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం కారణంగా బంతి స్పిన్‌ కాలేదు. స్పిన్నర్లు వేసిన బంతులు నేరుగా పిచ్‌ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఛేదన సులభమే కానీ 180పైన పరుగులు సాధిస్తే బౌలర్లకు వెసలుబాటు ఉంటుంది. న్యూజిలాండ్‌పై 110 పరుగులకే ఆలౌటయ్యాం. మంచు కూడా పెద్దగా ప్రభావం లేదు. కానీ స్కోరు బోర్డుపై పరుగులు లేకపోవడంతో బౌలర్లు కూడా ఏం చేయలేకపోయారు. మనం ఓడిపోవడానికి బ్యాటింగ్‌లో విఫలం కావడమే తప్ప మరే  కారణమూ లేదు’’ అని సన్నీ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని