2020 దయచేసి కనికరించు..

కేరళలోని కొజికోడ్‌ విమానాశ్రయ రన్‌వే గత రాత్రి చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంపై టీమ్‌ఇండియా క్రికెటర్లు స్పందించారు. శుక్రవారం రాత్రి దుబాయ్‌ నుంచి కొజికోడ్‌కు చేరుకున్న ఎయిర్‌...

Updated : 08 Aug 2020 11:49 IST

 విమాన ప్రమాదంపై టీమ్‌ఇండియా క్రికెటర్ల స్పందన..

ఇంటర్నెట్‌డెస్క్‌: కేరళలోని కొలికోడ్‌ విమానాశ్రయంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంపై టీమ్‌ఇండియా క్రికెటర్లు స్పందించారు. శుక్రవారం రాత్రి దుబాయ్‌ నుంచి కొలికోడ్‌కు చేరుకున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వేపై దిగబోతూ పక్కకు జారిపోయింది. దాంతో విమానం రెండు ముక్కలైంది. ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.

ఈ దుర్ఘటనపై భారత క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విమాన ప్రమాదంలో చిక్కుకున్న అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఈ విషాదకర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. -సచిన్‌ తెందూల్కర్‌

కొలికోడ్‌ నుంచి భయంకరమైన వార్త తెలిసింది. విమానం రెండు ముక్కలవ్వడం చూస్తుంటే భయమేసింది. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నా.  -గౌతమ్‌ గంభీర్‌

షాకింగ్‌ న్యూస్‌. కొలికోడ్‌లో చోటుచేసుకున్న ఎయిర్‌ఇండియా ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా.  - రోహిత్‌ శర్మ

ఈ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. అందరి కోసం ప్రార్థిస్తున్నా. 2020 దయచేసి కనికరించు. -యువరాజ్‌ సింగ్‌

కొలికోడ్‌ విమాన ప్రమాద బాధితుల కోసం ప్రార్థిస్తున్నా. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. -విరాట్‌ కోహ్లీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని