
నమ్మండి.. ఇతను శిఖర్ ధావనే.. సెహ్వాగ్ ట్వీట్లో..
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ శనివారం 35వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు చెప్పారు. ట్విటర్ వేదికగా బీసీసీఐ, ఐసీసీ, దిల్లీ క్యాపిటల్స్ కూడా గబ్బర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాయి. అతడు మరింత బాగా రాణించాలని ఆకాంక్షించాయి. గబ్బర్ తన బ్యాటింగ్‌తో భారత అభిమానులను అలరించాలని మాజీ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ సైతం ట్వీట్లు చేశారు.
ఈ క్రమంలోనే డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అందులో ధావన్ యువకుడిగా ఉన్నప్పటి (గుర్తుపట్టలేని) ఫొటోను అభిమానులతో పంచుకొని సరదా వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా, ధావన్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ తొలి వన్డేలో 74 పరుగులు చేసిన అతడు తర్వాత పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే మిగిలిన టీ20ల్లో దంచికొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రేపు జరిగే రెండో టీ20లో గబ్బర్ చెలరేగుతాడేమో చూడాలి.
ఇవీ చదవండి..
గబ్బర్ చెలరేగాల్సిన సమయం ఇది..
జడేజా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌పై రచ్చ?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.