
Chess: సత్తా చాటిన అర్జున్
రిగా (లాత్వియా): లిండోరెస్ అబే బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేసి మూడో స్థానంలో నిలిచాడు. అతడు 18 రౌండ్లలో 13.5 పాయింట్లు సాధించాడు. అర్జున్ మొత్తం 13 గేముల్లో నెగ్గాడు. దీంతో ప్రపంచ టాప్-30 ర్యాంకింగ్‌లోకి ప్రవేశించిన 18 ఏళ్ల అర్జున్.. తన ఎలో రేటింగ్‌ను 2723కు పెంచుకున్నాడు. ఈ ఒక్క టోర్నీ ద్వారానే అతడు 107.2 పాయింట్లు ఖాతాలో వేసుకోవడం విశేషం. మూడో స్థానంలో నిలవడం ద్వారా అతడు 6 వేల డాలర్ల ప్రైజ్‌మనీ కూడా దక్కించుకున్నాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.