IPL 2021: ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ విజయం
బెంగళూరు లక్ష్యం 142 పరుగులే. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా పుంజుకుని 14 ఓవర్లకు 92/3తో మెరుగైన స్థితిలోనే నిలిచిందా జట్టు. పడిక్కల్, మ్యాక్స్‌వెల్ నిలకడగా ఆడుతున్నారు. ఇంకా డివిలియర్స్ ఆడాల్సి ఉంది. 6 ఓవర్లలో 50 పరుగులు ఏమంత కష్టం కాదనే అనుకున్నారు ఆర్‌సీబీ అభిమానులు. కానీ ప్లేఆఫ్స్ రేసులో లేకపోయినా..
త్రుటిలో ఓడిన బెంగళూరు
అబుదాబి
బెంగళూరు లక్ష్యం 142 పరుగులే. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా పుంజుకుని 14 ఓవర్లకు 92/3తో మెరుగైన స్థితిలోనే నిలిచిందా జట్టు. పడిక్కల్, మ్యాక్స్‌వెల్ నిలకడగా ఆడుతున్నారు. ఇంకా డివిలియర్స్ ఆడాల్సి ఉంది. 6 ఓవర్లలో 50 పరుగులు ఏమంత కష్టం కాదనే అనుకున్నారు ఆర్‌సీబీ అభిమానులు. కానీ ప్లేఆఫ్స్ రేసులో లేకపోయినా.. పట్టుదల ప్రదర్శించిన సన్‌రైజర్స్ ఆర్‌సీబీకి కళ్లెం వేసింది. కీలకమైన వికెట్లు పడగొట్టి, పరుగులు కట్టడి చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఏబీ క్రీజులో ఉన్నా ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు. ఈ పరాజయంతో కోహ్లీసేన టాప్-2 ఆశలకు తెరపడ్డట్లే.
ఐపీఎల్ లీగ్ దశలో టాప్-2లో నిలిస్తే.. ప్లేఆఫ్స్‌లో ఒక మ్యాచ్ ఓడినా.. ఇంకో అవకాశం ఉంటుంది. అందుకే ఆర్‌సీబీ ఆ స్థానం కోసం గట్టి ప్రయత్నమే చేసింది కానీ.. దానికిక అవకాశం లేనట్లే. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన ఆ జట్టు.. గురువారం సన్‌రైజర్స్‌ను ఓడించి తొమ్మిదో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలనుకుంది. కానీ హైదరాబాద్ అవకాశమివ్వలేదు.ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. మొదట సన్‌రైజర్స్ 7 వికెట్లకు 141 పరుగులు చేసింది. జేసన్ (44; 38 బంతుల్లో 5×4), విలియమ్సన్ (31; 29 బంతుల్లో 4×4) రాణించారు. హర్షల్ పటేల్ (3/33), క్రిస్టియన్ (2/14) ఆ జట్టును కట్టడి చేశారు. అనంతరం సన్‌రైజర్స్ బౌలర్లందరూ సమష్టిగా సత్తా చాటి.. బెంగళూరును 137/6కు పరిమితం చేశారు. మ్యాక్స్‌వెల్ (40; 25 బంతుల్లో 3×4, 2×6), పడిక్కల్ (41; 52 బంతుల్లో 4×4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. చివరి మ్యాచ్‌లో గెలిచినా రన్‌రేట్‌లో చెన్నైని దాటడం కష్టమే కాబట్టి ఆర్‌సీబీ టాప్-2లోకి వెళ్లడం కష్టమే.
భువి కళ్లెం: ఛేదనలో ఆర్‌సీబీకి ఏమాత్రం ఆశించిన ఆరంభం లభించలేదు. ఫామ్‌లో ఉన్న కోహ్లి (5)ని తొలి ఓవర్లోనే వికెట్ల ముందు దొరకబుచ్చుకుని భువనేశ్వర్ (1/25) ఆర్‌సీబీకి షాకిచ్చాడు. కాసేపటికే క్రిస్టియన్ (1)ను కౌల్ పెవిలియన్ చేర్చాడు. పవర్‌ప్లే ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 37 పరుగులే చేసింది. తర్వాతి ఓవర్లో ఉమ్రాన్ మాలిక్.. భరత్ (12)ను ఔట్ చేశాడు. ఈ దశలో పడిక్కల్‌తో కలిసి మ్యాక్స్‌వెల్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. పడిక్కల్ నెమ్మదిగా ఆడినా.. మ్యాక్సీ మాత్రం తనదైన శైలిలో షాట్లు ఆడాడు. దీంతో స్కోరు వేగం పెరిగింది. 14 ఓవర్లకు 92/3తో ఆర్‌సీబీ మెరుగైన స్థితికి చేరుకుంది. మ్యాక్సీ జోరు చూస్తే.. కొన్ని బంతులుండగానే మ్యాచ్‌ను ముగించేస్తాడనిపించింది. కానీ అతణ్ని విలియమ్సన్ రనౌట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. రషీద్ ఖాన్.. తన చివరి ఓవర్లో పడిక్కల్‌ను పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో షాబాజ్ (14; 9 బంతుల్లో 2×4), డివిలియర్స్ (19 నాటౌట్; 13 బంతుల్లో 1×4, 1×6) కొన్ని షాట్లు ఆడి జట్టును విజయానికి చేరువ చేశారు. అయితే 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన స్థితిలో హోల్డర్ 19వ ఓవర్లో షాబాజ్‌ను ఔట్ చేయడమే కాక.. 5 పరుగులే ఇచ్చి ఆర్‌సీబీని ఒత్తిడిలో పడేశాడు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. తొలి 3 బంతుల్లో భువి ఒక్క పరుగే ఇచ్చాడు. నాలుగో బంతికి ఏబీ సిక్స్ అందుకోవడంతో ఉత్కంఠ రేగింది. కానీ తర్వాతి రెండు బంతులకు అతను షాట్లు ఆడలేకపోవడంతో ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు.
సన్‌రైజర్స్ కష్టంగా..: అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. గత మ్యాచ్‌తో పోలిస్తే ఎంతో మెరుగ్గా బ్యాటింగ్ చేసినప్పటికీ ప్రత్యర్థి ముందు ఆశించిన లక్ష్యాన్ని నిలపలేకపోయింది. సాహా బదులు ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ (13) ఎక్కువ సేపు క్రీజులో నిలవకపోయినా.. జేసన్ రాయ్, విలియమ్సన్ చక్కటి భాగస్వామ్యంతో సన్‌రైజర్స్‌కు భారీ స్కోరు చేసే అవకాశం కల్పించారు. కానీ మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. జేసన్, కేన్ మరీ ధాటిగా ఆడకపోయినా, నిలకడగా బ్యాటింగ్ చేసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. పవర్‌ప్లే అయ్యేసరికి 50/1తో నిలిచిన సన్‌రైజర్స్.. 11 ఓవర్లకు 81/1తో మెరుగ్గానే కనిపించింది. ఇక హిట్టింగ్ మొదలుపెట్టి భారీ స్కోరు సాధిస్తారనుకుంటే.. ఒకరి తర్వాత ఒకరు వికెట్లు సమర్పించుకుని జట్టును ఇబ్బందుల్లోకి నెట్టారు. 12వ ఓవర్లో కేన్‌ను హర్షల్ బౌల్డ్ చేయడంతో మొదలైంది సన్‌రైజర్స్ పతనం. 15వ ఓవర్లో క్రిస్టియన్.. గార్గ్ (15), రాయ్‌ల వికెట్లు తీసిన హైదరాబాద్‌ను గట్టి దెబ్బ తీశాడు. చివరి 5 ఓవర్లలో ఆ జట్టు మరో మూడు వికెట్లు కోల్పోయి 34 పరుగులే చేసింది. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెట్టిన హర్షల్.. చివరి ఓవర్లో 5 పరుగులే ఇచ్చి హోల్డర్ (16) వికెట్ తీశాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) అండ్ (బి) క్రిస్టియన్ 44; అభిషేక్ శర్మ (సి) మ్యాక్స్‌వెల్ (బి) గార్టన్ 13; విలియమ్సన్ (బి) హర్షల్ 31; గార్గ్ (సి) డివిలియర్స్ (బి) క్రిస్టియన్ 15; సమద్ ఎల్బీ (బి) చాహల్ 1; సాహా (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 10; హోల్డర్ (సి) క్రిస్టియన్ (బి) హర్షల్ 16; రషీద్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 141; వికెట్ల పతనం: 1-14, 2-84, 3-105, 4-107, 5-107, 6-124, 7-141; బౌలింగ్: సిరాజ్ 3-0-17-0; గార్టన్ 2-0-29-1;షాబాజ్ అహ్మద్ 4-0-21-0; హర్షల్ పటేల్ 4-0-33-3; చాహల్ 4-0-27-1; క్రిస్టియన్ 3-0-14-2
బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి ఎల్బీ (బి) భువనేశ్వర్ 5; పడిక్కల్ (సి) సమద్ (బి) రషీద్ ఖాన్ 41; క్రిస్టియన్ (సి) విలియమ్సన్ (బి) కౌల్ 1; శ్రీకర్ భరత్ (సి) సాహా (బి) ఉమ్రాన్ మాలిక్ 12; మ్యాక్స్‌వెల్ రనౌట్ 40; డివిలియర్స్ నాటౌట్ 19; షాబాజ్ అహ్మద్ (సి) విలియమ్సన్ (బి) హోల్డర్ 14; గార్టన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137; వికెట్ల పతనం: 1-6, 2-18, 3-38, 4-92, 5-109, 6-128; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-25-1; హోల్డర్ 4-0-27-1; సిద్ధార్థ్ కౌల్ 4-1-24-1; ఉమ్రాన్ మాలిక్ 4-0-21-1; రషీద్ ఖాన్ 4-0-39-1
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
The Kerala Story: వాళ్ల కామెంట్స్‌కు కారణమదే.. కమల్‌హాసన్ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్
-
General News
TSPSC Paper Leak Case: సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరం.. ఐటీ ఉద్యోగి అరెస్టు
-
World News
Cosmetic Surgeries: సౌందర్య చికిత్సతో ఫంగల్ మెనింజైటిస్.. కలవరపెడుతున్న మరణాలు
-
Politics News
PM Modi: భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో అధిష్ఠానం కీలక భేటీ
-
World News
Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు