
Updated : 25 Sep 2021 06:55 IST
IPL 2021: మహి-విరాట్ ఆఖరిగా!
ఇంటర్నెట్‌డెస్క్: మహేంద్రసింగ్ ధోని.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు.. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్‌లోనూ అతడు కొనసాగేది అనుమానంగానే ఉంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో సారథ్యం వదిలేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విరాట్ కోహ్లికి రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథిగా కూడా ఇదే చివరి సీజన్. ఈ నేపథ్యంలో కెప్టెన్లుగా దాదాపు చివరిసారి ధోని-కోహ్లి కలిశారు. శుక్రవారం ఐపీఎల్లో చెన్నై-బెంగళూరు మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ టాస్ సందర్భంగా ఎదురుపడడం ఆసక్తిని రేపింది. ఈ సీజన్లో చెన్నైతో బెంగళూరు ఇప్పటికే రెండుసార్లు తలపడిన నేపథ్యంలో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే తప్ప మళ్లీ ధోనితో కోహ్లి టాస్కు వెళ్లే దృశ్యాన్ని చూసే అవకాశం అభిమానులకు ఇక లేనట్లే!
ఇవీ చదవండి
Tags :