IPL 2021: కోల్‌కతా.. ఇంకోటి

మిగిలి ఉన్న ఏకైక ప్లేఆఫ్స్‌ స్థానాన్ని చేజిక్కించుకునే దిశగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరో అడుగేసింది. ఆరో విజయంతో తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. శుభ్‌మన్‌ గిల్‌ (57; 51 బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో ఆదివారం 6 ...

Updated : 10 Oct 2022 11:06 IST

ఆరో విజయంతో ప్లేఆఫ్‌ రేసులో ముందంజ

 మళ్లీ ఓడిన సన్‌రైజర్స్‌

దుబాయ్‌

మిగిలి ఉన్న ఏకైక ప్లేఆఫ్స్‌ స్థానాన్ని చేజిక్కించుకునే దిశగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మరో అడుగేసింది. ఆరో విజయంతో తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. శుభ్‌మన్‌ గిల్‌ (57; 51 బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో ఆదివారం 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచింది. సౌథీ (2/26), శివమ్‌ మావి (2/29), వరుణ్‌ చక్రవర్తి (2/26), షకిబ్‌ (1/20), నరైన్‌ (0/12) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మొదట సన్‌రైజర్స్‌ 8 వికెట్లకు 115 పరుగులే చేయగలిగింది. 26 పరుగులు చేసిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ టాప్‌ స్కోరర్‌. గిల్‌తో పాటు నితీష్‌ రాణా (25; 33 బంతుల్లో 3×4) రాణించడంతో లక్ష్యాన్ని కోల్‌కతా 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్వల్ప లక్ష్యమే అయినా ఛేదనలో కోల్‌కతా కూడా ఇబ్బంది పడింది. 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులే చేసింది. ఆ దశలో గిల్‌ గేర్‌ మార్చాడు. మెరుపు షాట్లతో జట్టును విజయానికి చేరువ చేశాడు. అంతా సాఫీగా సాగిపోతుండగా 17వ ఓవర్లో గిల్‌ ఔటయ్యాడు. చివరి మూడు ఓవర్లలో కోల్‌కతా విజయానికి కావాల్సింది 17 పరుగులే అయినా.. 18వ ఓవర్లో రాణా ఔటైపోయాడు. అయితే దినేశ్‌ కార్తీక్‌ (18  నాటౌట్‌) ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు.

సన్‌రైజర్స్‌ తడబాటు: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌.. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై   పరుగుల కోసం చెమటోడ్చింది. పేసర్‌ సౌథీతో పాటు స్పిన్నర్లు ఆ జట్టును స్వేచ్ఛ ఆడనివ్వలేదు. 10 ఓవర్లు ముగిసే సరికి సాహా, జేసన్‌ రాయ్‌,  విలియమ్సన్‌ వికెట్లు కోల్పోయి 51  పరుగులు మాత్రమే చేసింది సన్‌రైజర్స్‌. శివమ్‌ మావి వేసిన ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో విలియమ్సన్‌ 4 ఫోర్లు కొట్టి ఉండకపోతే స్కోరు ఇంకా తక్కువగా ఉండేదే. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ సన్‌రైజర్స్‌ చివరి వరకూ ఇబ్బందిపడింది. నరైన్‌, షకిబ్‌కు తోడు వరుణ్‌ కూడా బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం బ్యాట్‌ ఝుళిపించే అవకాశం ఇవ్వలేదు. గార్గ్‌ (21; 31 బంతుల్లో 1×6), సమద్‌ (25; 18 బంతుల్లో 3×6) కాస్త రాణించడంతో సన్‌రైజర్స్‌ స్కోరు వంద దాటింది.

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) సౌథీ (బి) మావి 10; సాహా ఎల్బీ (బి) సౌథీ 0; విలియమ్సన్‌ రనౌట్‌ 26; గార్గ్‌ (సి) త్రిపాఠి (బి) వరుణ్‌ 21; అభిషేక్‌ (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) షకిబ్‌ 6; సమద్‌ (సి) శుభ్‌మన్‌ (బి) సౌథీ 25; హోల్డర్‌ (సి) వెంకటేశ్‌ (బి) వరుణ్‌ 2; రషీద్‌ (బి) వెంకటేశ్‌ (బి) శివమ్‌ మావి 8; భువనేశ్వర్‌ నాటౌట్‌ 7; కౌల్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 115; వికెట్ల పతనం:  1-1, 2-16, 3-38, 4-51, 5-70, 6-80, 7-95, 8-103; బౌలింగ్‌: సౌథీ 4-0-26-2; మావి 4-0-29-2; వరుణ్‌ 4-0-26-2; షకిబ్‌ 4-0-20-1; నరైన్‌ 4-0-12-0

కోల్‌కతా ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ (సి) హోల్డర్‌ (బి) కౌల్‌ 57; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) విలియమ్సన్‌ (బి) హోల్డర్‌ 8; త్రిపాఠి (సి) అభిషేక్‌ (బి) రషీద్‌ 7; నితీష్‌ (సి) సాహా (బి) హోల్డర్‌ 25; కార్తీక్‌ నాటౌట్‌ 18; మోర్గాన్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 119; వికెట్ల పతనం: 1-23, 2-38, 3-93, 4-106; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-20-0; హోల్డర్‌ 4-0-32-2; ఉమ్రాన్‌ 4-0-27-0; రషీద్‌ 4-0-23-1; కౌల్‌ 3.4-0-17-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని