
IND vs PAK: షమీపై మాటల దాడి.. అండగా ఆటగాళ్లు
దుబాయ్: వన్డే, టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి దాయాది పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోవడంతో అభిమానులు తీవ్ర కలత చెందారు. కానీ కొంతమంది మాత్రం మరీ హద్దులు దాటి ఈ మ్యాచ్లో తన బౌలింగ్లో 3.5 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చిన మహమ్మద్ షమి ప్రదర్శనకు అతని మతాన్ని జోడిస్తూ సామాజిక మాధ్యమాల్లో దూషిస్తున్నారు. ఈ నేపథ్యంలో షమీకి అండగా తాజా, మాజీ భారత ఆటగాళ్లు నిలిచారు. ‘‘మేం టీమ్ఇండియాకు మద్దతుగా నిలవడం అంటే జట్టులోని ప్రతి ఆటగాడికి మద్దతు తెలిపినట్లే. షమి అంకితభావం ఉన్న ప్రపంచ స్థాయి బౌలర్. మిగతా క్రీడాకారుల్లాగే అతనూ ఒక రోజు విఫలమయ్యాడు. షమి, టీమ్ఇండియాకు నేను మద్దతుగా నిలుస్తా’’ అని సచిన్ ట్వీట్ చేశాడు. సెహ్వాగ్, హర్భజన్, చాహల్, మాజీ పేసర్ ఆర్పీ సింగ్ కూడా షమీకి అండగా నిలిచారు. మరోవైపు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా షమీపై దూషణలను ఖండించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.