T20 World Cup: రోహిత్‌కు జోడీ రాహులే: కోహ్లీ

టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మకు జోడీగా ఎవరు ఇన్నింగ్స్‌ ఆరంభిస్తారనే విషయంపై టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లి స్పష్టతనిచ్చాడు. మరో  ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అని, తను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని ...

Updated : 19 Oct 2021 07:41 IST

దుబాయ్‌: టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మకు జోడీగా ఎవరు ఇన్నింగ్స్‌ ఆరంభిస్తారనే విషయంపై టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లి స్పష్టతనిచ్చాడు. మరో  ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అని, తను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని అతను వెల్లడించాడు. సోమవారం ఇంగ్లాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌కు ముందు టాస్‌ సందర్భంగా.. ఈ నెల 24న పాకిస్థాన్‌తో తొలి పోరుకు భారత జట్టు టాప్‌-6 బ్యాటర్లు ఎవరనే ప్రశ్నకు కోహ్లి ఇలా సమాధానమిచ్చాడు. ‘‘ఐపీఎల్‌కు ముందు పరిస్థితులు భిన్నం. ఇప్పుడు రాహుల్‌ లేని టాప్‌ఆర్డర్‌ని చూడడం కష్టం. ప్రపంచ స్థాయి ఆటగాడైన రోహిత్‌ ఓపెనర్‌గా వస్తాడు. అతనికి జతగా రాహుల్‌ ఉంటాడు. నేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతా. ఇప్పటికైతే ఇంతే చెప్పగలను’’ అని అతను తెలిపాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 14వ సీజన్‌లో రాహుల్‌ 628 పరుగులతో సత్తా చాటిన సంగతి తెలిసిందే. ‘‘ఈ వార్మప్‌ మ్యాచ్‌ల్లో మా ఆటగాళ్లందరికీ వీలైనంత ఎక్కువ సమయం మైదానంలో గడిపే అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. జట్టుగా శక్తిని, లయను అందుకోవాలి. ఐపీఎల్‌లో వివిధ జట్లకు ఆడాం. కానీ ఇప్పుడు అందరం ఒక్క జట్టుగా కలిసిపోవాలి. పరిస్థితులకు అనుకూలంగా మారడం ముఖ్యం. జట్టుకు అలవాటు పడాలి. ఫీల్డింగ్‌ సమయంలో పదకొండు మంది ఒక్కటిగా ఉంటారు. ఐపీఎల్‌లో ఆట ప్రమాణాలు పెరిగాయి. కానీ టీమ్‌ఇండియాకు ఆడడమే అన్నింటికంటే అత్యున్నతమైంది. పాక్‌తో తొలి మ్యాచ్‌కు ఓ స్పష్టతతో ఉన్నాం’’ అని కోహ్లి పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని