Yuvraj Singh: యువరాజ్‌ అరెస్టు, విడుదల

భారత క్రికెట్‌ జట్టు మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ అరెస్ట్‌ అయ్యాడు. ఒక కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆదివారం అరెస్ట్‌ అయిన అతడు.. వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. నిరుడు జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌...

Updated : 20 Sep 2022 15:28 IST

హిసార్‌: భారత క్రికెట్‌ జట్టు మాజీ స్టార్‌ యువరాజ్‌ సింగ్‌ అరెస్ట్‌ అయ్యాడు. ఒక కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆదివారం అరెస్ట్‌ అయిన అతడు.. వెంటనే బెయిల్‌పై విడుదలయ్యాడు. నిరుడు జూన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ వీడియోలో క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌తో మాట్లాడుతూ కుల వివక్ష వ్యాఖ్యలు చేశాడన్నది అతడిపై ఆరోపణ. పంజాబ్‌-హరియాణా హైకోర్టు ఆదేశాల మేరకు ఆదివారం యువీని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడిని పూచీకత్తుపై వదిలిపెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని