Ravi Shastri: మళ్లీ కోచ్‌గా రవిశాస్త్రి!

టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం సోమవారం ముగిసిపోనుంది. ఆ తర్వాత కూడా అతడు కోచ్‌గా ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్‌ కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్‌ యాజమాన్యం రవిని సంప్రదించినట్లు సమాచారం. ...

Updated : 08 Nov 2021 13:07 IST

దిల్లీ: టీమ్‌ఇండియా కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం సోమవారం ముగిసిపోనుంది. ఆ తర్వాత కూడా అతడు కోచ్‌గా ఉండే అవకాశం ఉంది. ఐపీఎల్‌ కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్‌ యాజమాన్యం రవిని సంప్రదించినట్లు సమాచారం. అతడితో పాటు.. టీమ్‌ఇండియా బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌లు భరత్‌ అరుణ్‌, ఆర్‌.శ్రీధర్‌లను ఎంపిక చేసుకునేందుకు ఆ ఫ్రాంఛైజీ సిద్ధమవుతుందట. దాదాపుగా ఏడేళ్లు టీమ్‌ఇండియాతో కలిసి పనిచేసిన శాస్త్రి.. ఐపీఎల్‌లో కొత్త జట్టు కోసం మళ్లీ కోచ్‌ అవతారం ఎత్తుతాడా అన్నది చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని