Tokyo Olympics: కొరికినందుకు క్షమించమన్నాడు: రవి కుమార్‌ దహియా

చేతి కండను కొరికినందుకు కజకిస్థాన్‌ రెజ్లర్‌ సనయేవ్‌ క్షమాపణ చెప్పాడని టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత రవి దహియా చెప్పాడు. సెమీఫైనల్‌ బౌట్‌ ఆఖర్లో రవికి చిక్కిన సనయేవ్‌ వెల్లకిలా పడే క్రమంలో గట్టిగా కొరికేశాడు.

Updated : 10 Aug 2021 07:00 IST

దిల్లీ: చేతి కండను కొరికినందుకు కజకిస్థాన్‌ రెజ్లర్‌ సనయేవ్‌ క్షమాపణ చెప్పాడని టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత రవి దహియా చెప్పాడు. సెమీఫైనల్‌ బౌట్‌ ఆఖర్లో రవికి చిక్కిన సనయేవ్‌ వెల్లకిలా పడే క్రమంలో గట్టిగా కొరికేశాడు. ఈ దృశ్యం సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అయింది. ‘‘రెజ్లింగ్‌ అంటేనే దూకుడైన ఆట. ఇందులో రెజ్లర్లు ఒక్కోసారి బాహాబాహీకీ దిగుతుంటారు. ఇవన్నీ ఈ ఆటలో చాలా చిన్న విషయాలు. సెమీఫైనల్లో సనయేవ్‌ నా చేతి కండను కొరికిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయా. అతడిపై ఎలాంటి చెడు ఉద్దేశం పెట్టుకోలేదు. ఈ సంఘటన తర్వాత రోజు ఆటగాళ్ల బరువు తూచే దగ్గర సనయేవ్‌ ఎదురుపడ్డాడు. నా దగ్గరకు వచ్చి కరచాలనం చేసి పలకరించాడు. నేనూ అతడిని తిరిగి పలకరించాను. ఆ తర్వాత అతడు నన్ను కౌగిలించుకుని ‘క్షమించు సోదరా’ అని అన్నాడు. నేను నవ్వి అతడిని మళ్లీ కౌగిలించుకున్నా’’ అని రవి చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని