క్రికెట్‌లో గొప్ప రనౌట్‌.. చూశారా?

క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దాంతో ఎవరూ ఊహించని రీతిలో బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పడుతుంటారు. ఎక్కువ శాతం ఫీల్డర్లు తమ విన్యాసాలతో...

Updated : 07 Nov 2020 10:52 IST

వార్నర్‌ని ఔట్‌ చేసిన తెంబా బవుమా

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో అప్పుడప్పుడూ కొన్ని అరుదైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. దాంతో ఎవరూ ఊహించని రీతిలో బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పడుతుంటారు. ఎక్కువ శాతం ఫీల్డర్లు తమ విన్యాసాలతో అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. లేదా వికెట్‌ కీపర్లు మెరుపు వేగంతో స్టంపింగ్‌లు, క్యాచ్‌లు అందుకుంటారు. కానీ ఎవరైనా బ్యాట్స్‌మెన్‌ రనౌటైతే మాత్రం పెద్దగా ఆసక్తి అనిపించదు. బ్యాట్స్‌మెన్‌ పరుగెడుతుంటే బంతిని వికెట్లకేసీ కొట్టడంలో ఏముందని సహజంగా అనిపిస్తుంది. అయితే, క్రికెట్‌లో రెండు అరుదైన రనౌట్లు ఉన్నాయి. అవెప్పటికీ గొప్ప రనౌట్‌లుగా మిగిలి ఉంటాయి. అవి ఎప్పుడు ఎక్కడ చోటుచేసుకున్నాయో తెలుసుకుందాం.

వార్నర్‌ని ఔట్‌ చేసిన తెంబా బవుమ..
సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే సమయంలో కంగారూ గడ్డపై దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 242 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 244 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 540/8 భారీ స్కోర్‌ చేయడంతో కంగారూ ఛేదనకు దిగింది. అయితే, నాలుగో రోజు డేవిడ్‌ వార్నర్‌(35) పరుగులు చేశాక రనౌటయ్యాడు. అతడు బంతికి బ్యాట్‌ తగిలించి సింగిల్‌ కోసం ప్రయత్నించడంతో అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న బవుమ మెరుపు వేగంగా బంతిని అందుకొని వికెట్లకు వేసి కొట్టాడు. దాంతో వార్నర్‌ ఔటయ్యాడు. అయితే, బవుమ త్రో విసిరిన తీరే ప్రేక్షకులను ఆకట్టుకుంది. అతడు డైవ్‌ చేస్తూనే బంతిని విసిరాడు. వార్నర్‌ క్రీజులో బ్యాట్‌ పెట్టకముందే బెయిల్స్‌ ఎగిరిపోయాయి. దాంతో అది గొప్ప రనౌట్‌గా మిగిలిపోయింది. అది జరిగి నేటికి నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఆ వీడియోను క్రికెట్‌.కామ్‌ అనే ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది.  

పుజారాను ఔట్‌ చేసిన పాట్‌కమిన్స్‌..
ఆ తర్వాత 2018లోనూ ఇలాంటి రనౌటే చోటుచేసుకుంది. టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఛెతేశ్వర్‌ పుజారాను పాట్‌కమిన్స్‌ కూడా ఇలాగే రనౌట్‌ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా(123) పరుగుల వద్ద సింగిల్‌ తీస్తుండగా మెరుపు ఫీల్డింగ్‌ చేశాడు. అతడు కూడా డైవ్‌ చేస్తూనే బంతిని వికెట్లకు విసిరాడు. దాంతో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ ఔటయ్యాడు. ఇది కూడా అత్యుత్తమ రనౌట్‌గా మిగిలిపోయింది. అయితే పలువురు క్రికెట్‌ అభిమానులు బవుమ రనౌట్‌ కంటే కమిన్స్‌దే గొప్పగా ఉందని భావిస్తున్నట్లు ఆ వెబ్‌సైట్‌ పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని